Site icon NTV Telugu

Raayan: జాతీయ అవార్డు నటిని దింపిన ధనుష్.. ఇక రచ్చ రచ్చే

Raayan

Raayan

Raayan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత ధనుష్ నటిస్తున్న చిత్రం రాయన్. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ధనుష్ కెరీర్ లో ఇది 50 వ సినిమా గా తెరకెక్కుతుండగా.. దీనికి ధనుష్ కథను అందించి దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఈ మధ్యనే ఈ సినిమా నుంచి ధనుష్ లుక్ ను రివీల్ చేశారు. ధనుష్ రక్తంతో తడిచిన చేతితో పిడికిలి బిగించి కనిపిస్తోంది. ఇక అతని వెనుక, సందీప్ కిషన్ మరియు కాళిదాస్ జయరామ్ చేతిలో కత్తులు ఉన్నాయి. సినిమాలో హింసకు లోటు ఉండదని పోస్టర్ ను చూస్తే అర్ధం అవుతోంది.

తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ లుక్ ను రివీల్ చేశారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన జాతీయ అవార్డు నటి అపర్ణ బాలమురళి నటిస్తోంది. ఆకాశం నీ హద్దురా సినిమాలో అపర్ణ నటనకు జాతీయ అవార్డు వరించిన విషయం తెల్సిందే. భూమిగా ఆమె నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక ఆ సినిమా తరువాత అంతటి న్యాచురల్ నటన రాయన్ లో కనిపించబోతుందని లుక్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. ఒక సాధారణ గృహిణిలా అపర్ణ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో అపర్ణ మరో జాతీయ అవార్డును అందుకుంటుందేమో చూడాలి.

Exit mobile version