NTV Telugu Site icon

Raashii Khanna : హైదరాబాద్ లో మరో ఇల్లు కొన్న రాశి ఖన్నా.. ఫోటోలు వైరల్..

Rasi

Rasi

తెలుగు సినిమాల్లో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లే ఎక్కువగా నటిస్తున్నారు… ఇప్పటికి ఎందరో హీరోయిన్లు ఇక్కడకు ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. తెలుగు నేర్చుకొని మరి తెలుగు సినిమాలు చేస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.. కొందరు హైదరాబాద్లో నే సొంతంగా ఇల్లు కొనుక్కొని ఇక్కడే సెటిల్ అవుతున్నారు.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి రాశి ఖన్నా చేరింది.. తాజాగా హైదరాబాద్ లో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది.. ఆ ఇంటి గృహ ప్రవేశం ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస హిట్ సినిమాల్లో నటించింది.. తెలుగుతో పాటు తమిళ్, హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.. అయితే ఈ అమ్మడు హైదరాబాద్ లో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది.. ఇప్పటికే రెండు ఉన్నా కూడా మరో ఇంటిని కొనుగోలు చేసింది..

తాజాగా తన తల్లి, సన్నిహితులతో కలిసి గృహప్రవేశం చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో రాశీ ఖన్నా ‘తెలుసు కదా’ సినిమా చేస్తున్నారు.. అలాగే తమిళంలో కూడా పలు సినిమాలు చేస్తుంది.. వీటితో పాటుగా బాలివుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది..