గత వారం రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా వర్షాలు, వరదలు. కంటిన్యూగా వర్షాలు కురుస్తుండడంతో.. చిన్న కాలువల నుంచి పెద్ద పెద్ద చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఎన్నో గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. పలు రైళ్లు రద్దయ్యాయి. అంతే కాకుండా వరదల్లో ఎంతో మంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం ప్రభుత్వాలు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాఫ్టర్ సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. తాజాగా ఈ వరదల్లో ఓ స్టార్ హీరో చిక్కుకున్నాడని తెలిసింది.
Also Read: CM Chandrababu: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతి కుటుంబానికీ ‘ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్’!
సోషల్ మీడియాలో తాను వరదల్లో చిక్కుకున్నాను అని తెలిపాడు ఓ స్టార్ హీరో. ఇంతకూ అతను ఎవరో కాదు హీరో ఆర్ మాధవన్. జమ్మూకాశ్మీర్‌లో భారీ వర్షం, వరదల కారణంగా లేహ్‌లో చిక్కుక్కుపోయినట్లు మాధవన్ తెలిపారు. 17 సంవత్సరాల తర్వాత తాను మరోసారి వర్షాల కారణంగా లేహ్‌లో చిక్కుకుని పోయినట్లు తెలిపాడు. ‘గతంలో త్రీ ఇడియట్స్ సినిమా కోసం ఇక్కడికి వచ్చి ఇలానే చిక్కుకున్నా. ఇప్పుడు మరోసారి వరదల్లో చిక్కుకున్నా. ఏది ఏమైనా ఇది చాలా అందమైన ప్రదేశం. ప్రస్తుతం విమానాలు లేవు’ అంటూ మాధవన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. మాధవన్ ప్రస్తుతం తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు.
