Site icon NTV Telugu

R Madhavan: ఎఫ్‌టీఐఐ కొత్త అధ్యక్షుడిగా మాధవన్‌ నామినేట్.. అభినందించిన కేంద్ర మంత్రి

Madhavan

Madhavan

R Madhavan: భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రఖ్యాత నటుడు ఆర్.మాధవన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) అధ్యక్షుడిగా, పాలక మండలి ఛైర్మన్‌గా నామినేట్ అయ్యారు. కొత్త ఎఫ్‌టీఐఐ ప్రెసిడెంట్‌గా ఆర్‌ మాధవన్‌ను ఇటీవల ప్రకటించారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నటుడికి తన శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్‌ వేదికగా కేంద్ర మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడికి తన శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Pawan Kalyan: ఎట్టకేలకు పవన్- సురేందర్ సినిమా మొదలు.. ఆ రీమేక్ యేనా..?

మాధవన్‌ ఎఫ్‌టీఐఐ ప్రెసిడెంట్‌గా నామినేట్‌ అయినందుకు ట్విటర్‌ వేదికగా కేంద్ర మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అపారమైన అనుభవం, బలమైన నీతి ఈ ఇన్‌స్టిట్యూట్‌ను సుసంపన్నం చేస్తుందని, సానుకూల మార్పులను తీసుకువస్తుందని, ఉన్నత స్థాయికి తీసుకువెళతాయని తాను భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. విలక్షణ నటుడు ఆర్‌ మాధవన్ స్వీయ‌ దర్శకత్వంలో నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ ఇటీవలే ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది.

Exit mobile version