NTV Telugu Site icon

R. Ashwin: సీఎస్కేకు తిరిగి రావడంపై ఓపెన్ అయిపోయిన అశ్విన్..

Ashwin

Ashwin

ఐపీఎల్ 2025లో రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరపున ఆడనున్నాడు. కాగా.. 2009లో సీఎస్కే తరుఫున అశ్విన్ అరంగేట్రం చేశాడు. 2015 వరకు ఏడు సీజన్లు చెన్నైకి ఆడాడు. ఆ తర్వాత 2016, 2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. 2018లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. ఆ తర్వాత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. 2022 నుండి 2024 వరకు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. తాజాగా జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్‌ను రూ.9.75 కోట్లకు దక్కించుకుకుంది. ఐపీఎల్‌లో తన కెరీర్ ఎక్కడైతే మొదలుపెట్టాడో.. తిరిగి అక్కడికే వచ్చాడు.

Read Also: Himachal: రాష్ట్ర పథకాలకు “దేవాలయాల” డబ్బులు.. కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఆగ్రహం..

ఈ క్రమంలో.. చెన్నై సూపర్ కింగ్స్‌కు తిరిగి రావడంపై అశ్విన్ ఓపెన్ అయ్యాడు. 2025లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు తిరిగి రావడం వింతగా అనిపించిందని అన్నాడు. ‘నేను చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వదిలి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు తిరిగి జట్టులో చేరడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. జట్టులో అందరూ ఒకేలా ఉన్నారు, నేనే చాలా సీనియర్‌గా అనిపిస్తోంది. చేపాక్ వేదికపై ఆడటానికి ఎదురు చూస్తున్నాను” అని సీఎస్కే అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో విడుదలైన వీడియోలో అశ్విన్ తెలిపాడు.

Read Also: CM Revanth Reddy: పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది..

చెన్నై తరపున 97 మ్యాచ్‌లలో 6.46 ఎకానమీ రేటుతో 90 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. ఛాంపియన్స్ లీగ్ టీ20లో 24 మ్యాచ్‌లలో 7.44 ఎకానమీ రేటుతో 30 వికెట్లు పడగొట్టాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓడిపోయిన తర్వాత.. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. సీఎస్కే మార్చి 23న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌ను ఆడుతుంది.