NTV Telugu Site icon

R Ashwin: నాకు చాలా బాధ అనిపించింది.. కానీ ఏం చేయలేం..

Ashwin

Ashwin

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మరోసారి రన్నరప్‌కే పరిమితమైంది. డబ్ల్యూటీసీ 2021-23 విజేతగా ఆస్ట్రేలియా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఫైనల్లో టీమిండియాపై 209 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా సగర్వంగా టైటిల్‌ను అందుకుంది. అయితే టెస్టుల్లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్‌ అశ్విన్‌ను టీమిండియా తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించిన విషయం. అయితే అశ్విన్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ను అదనపు పేసర్‌గా తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై సర్వాత్రా విమర్శలు వచ్చినప్పటికి మ్యాచ్‌ ముగిసేవరకు ఆర్. అశ్విన్‌ మాత్రం స్పందించలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగిసిన అనంతరం అశ్విన్‌ ఎట్టకేలకు రియాక్ట్ అయ్యాడు.

Also Read : Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు వివాదం.. ఐఏఎస్ అధికారి నోటీసుకు రేవంత్ రియాక్షన్‌

ట్విటర్‌ ద్వారా స్పందించిన అశ్విన్‌ ముందుగా ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు చెప్పాడు. డబ్ల్యూటీసీ టైటిల్‌ సాధించిన పాట్‌ కమిన్స్‌ సేనకు కంగ్రాట్స్‌.. ఈ విజయానికి వారు అర్హులు.. నన్ను ఎంపిక చేయకపోవడంపై పెద్దగా బాధ లేదు.. ఎందుకంటే జట్టులోకి ఎంత కష్టపడినా 11 మందికి మాత్రమే అవకాశం దక్కుతుంది అని అన్నాడు. వికెట్‌ పేసర్లకు అనుకూలంగా ఉండడంతో ఒక స్పిన్నర్‌ చాలనుకొని జడేజాను ఆడించారు.. కానీ టీమిండియా ఓటమి నాకు తీవ్రంగా బాధ కలిగించింది అని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు.

Also Read : Ruthuraj Gaikwad: చెన్నై ప్రజలకు ఎంగేజ్మెంట్ ను అంకితం చేసిన సీఎస్కే ఓపెనర్

మన జట్టులో కొన్ని లోపాలున్నప్పటికి గెలవడానికి ప్రయత్నించిన తీరు బాగుందని అశ్విన్ అన్నాడు. రెండేళ్లు కష్టపడితే డబ్ల్యూటీసీ ఫైనల్‌ వరకు వచ్చాం.. ఇలా ఆఖరి మెట్టుపై బోల్తా పడడం కొద్దిగా బాధనే కలిగిస్తుంది కదా.. ఇంకో విషయం ఏంటంటే.. ఈ రెండేళ్లలో నాతో పాటు ఎన్నో టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు.. ముఖ్యంగా కోచింగ్‌, సపోర్ట్‌ స్టాఫ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ ఆర్. అశ్విన్ తెలిపాడు.

Also Read : Cholesterol Control Tips : కొవ్వును వెన్నలా కరిగించే ఆయుర్వేద మూలికలు..

ఇక డబ్ల్యూటీసీ 2021-23లో టీమిండియా తరపున అశ్విన్‌ అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. ఈ ప్రయాణంలో అశ్విన్‌ మొత్తంగా 61 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ అదే డబ్ల్యూటీసీ ఫైనల్లో మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఒకవేళ అశ్విన్‌ ఫైనల్‌ ఆడి ఉంటే టీమిండియా పరిస్థితి మరోలా ఉండేదేమో అని టీమిండియా క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.