Etela Rajendar: మల్కాజిగిరికి ఈటల సరిపోతారని హైకమాండ్ టికెట్ ఇచ్చిందని, బీజేపీ సోషల్ ఇంజినీరింగ్‌లో నెంబర్‌వన్ అని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ సారి మోడీని ప్రధానిని చేయాలన్న భావన ప్రజల్లో కనిపిస్తోందన్నారు. మల్కాజిగిరిలో ఈటలను ఓడించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్రానికే లోకల్ లీడర్‌ను తానని.. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. నియోజకవర్గంలో ఉండే పరిస్థితులను బట్టి గెలుపోటములు ఉంటాయన్నారు.
Read Also: Chilukuru Temple: చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేత
గజ్వేల్‌లో పైసలు ప్రలోభాలతో కేసీఆర్ గెలిచారని.. 2018 వరకూ పైసా పంచకుండా, ప్రేమతో ఎన్నికల్లో గెలిచానని ఈటల రాజేందర్ తెలిపారు. ఈటల డబ్బును నమ్ముకోలేదన్నారు. టికెట్ల కేటాయింపులో ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం ఉండదన్నారు. మోడీ పదేళ్ల పాలనలో ఎలాంటి స్కాములు లేవన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై స్పందించిన ఈటల.. దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లు ఎన్నొచ్చాయి? బీఆర్‌ఎస్‌కు ఎన్నొచ్చాయో చూడాలన్నారు. ఏ పార్టీ అయినా గెలిచే అభ్యర్థులను పోటీకి నిలబెడుతుందని.. సర్వేల మీద ఆధారపడి కేటాయింపులు ఉంటాయన్నారు.
Read Also: CM Revanth Reddy: నేత కార్మికులకు రూ.50 కోట్లు.. బకాయిల చెల్లింపునకు సీఎం నిర్ణయం
కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకుల కార్పొరేట్లకు లక్షల కోట్లు రుణాలిచ్చారని.. రూ 11 లక్షల కోట్ల రుణాల విషయంలో ఎందుకు కాంగ్రెస్ సరిగ్గా వ్యవహరించలేకపోయిందని ఈటల ప్రశ్నించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఆస్తులు సీజ్ చేశారన్నారు. నేతలు ఏ పార్టీలో ఉన్నారు అన్న విషయాన్ని దర్యాప్తు సంస్థలు పట్టించుకోవని.. తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.. సర్వేల ప్రకారం బీజేపీ 12 సీట్లలో గెలిచే అవకాశముందన్నారు. రేవంత్‌రెడ్డిని నేతగా కాదు సీఎంగా చూస్తామన్నారు.పదవిలోకి రాకముందు ఒకలా, వచ్చిన తర్వాత మరోలా రేవంత్‌రెడ్డి ప్రవర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలను కూల్చడం బీజేపీ పాలసీ కాదన్నారు. ఒక పార్టీని లేకుండా చేయడం ఇంకోపార్టీకి సాధ్యం కాదన్నారు.