Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్‌లో రోడ్డున పడ్డ ఇంజనీర్!
- ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. చివరకు లేఆఫ్..
- వైరల్ అవుతున్న క్వాల్కామ్ ఉద్యోగి లేఆఫ్ స్టోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Qualcomm Layoffs: టెక్ ఉద్యోగులకు భరోసా లేకుండా పోయింది. చిన్న కంపెనీల నుంచి మొదలు అతిపెద్ద టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి డిగ్రీలు పొందినా కూడా లేఆఫ్స్ తప్పడం లేదు. తాజాగా ఇంటర్నెట్లో ఓ ఉద్యోగి విషయం వైరల్‌గా మారింది. ప్రముఖ చిక్ తయారీ సంస్థ క్వాల్కామ్ తొలగింపుల్లో ఏడాదికి రూ. 26 లక్షల ప్యాకేజీ కలిగిన ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. తన స్నేహితుడికి ఎదురైన చేదు అనుభవాన్ని వికాస్ అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఫ్రెండ్ ఉద్యోగం పోయిందని పోస్ట్..
క్వాల్కామ్ లేఆఫ్‌లో తన స్నేహితుడి ఉద్యోగం పోయిందని వికాస్ ఆల్వేస్ అనే నెటిజన్ వెల్లడించారు. ఎంతో కష్టపడి క్యాంపప్ ప్లేస్మెంట్లో ఉద్యోగం సాధించినా, చివరకు లేఆఫ్ తప్పలేదని చెప్పారు. బీటెక్ చదవుతున్న సమయంలోనే తన స్నేహితుడికి సదర్లాండ్ సంస్థలో నాన్-టెక్నికల్ జాబ్ అవకాశం వచ్చిందని, అయితే ఉద్యోగంలో చేరకుండా గేట్ పరీక్షకు సిద్ధమై, ఒక ఏడాది కష్టపడి 1100 ర్యాంక్ సాధించి, ఐఐటీ హైదరాబాద్‌లో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (VLSI) విభాగంలో ఎం.టెక్ చదివినట్లు చెప్పాడు.
Also Read
- Kareena Kapoor: కరీనా లాకెట్‌పై ఖురాన్ వచనాలు.. కాంగ్రెస్ నేత లీగల్ నోటీసులు!
- Goree Beauty Cream: భారత్‌లో పాకిస్తానీ ఫెయిర్‌నెస్ క్రీమ్.. వాడితే కిడ్నీలు ఖతం..
- Gandhi Family: ఇందిరా గాంధీ – మేనక మధ్య విభేదాలకు అసలు కారణాలివే.. సోనియా ఆత్మకథలో కీలక విషయాలు!
- Kangana Ranaut: సంజయ్, ఇందిరా, రాజీవ్ గాంధీ మరణాలు.. సోనియాపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు..
రూ. 26 లక్షల భారీ ప్యాకేజీతో క్వాల్కామ్ జాబ్..
ఐఐటీ హైదరాబాద్‌లో రెండేళ్ల ఎం.టెక్ పూర్తి చేసిన తర్వాత క్వాల్కామ్లో క్యాంపస్ ప్లేస్మెంట్ ఉద్యోగం పొందినట్లు వికాస్ వెల్లడించారు. తన స్నేహితుడికి ఏడాదికి రూ.18 లక్షల బేస్ శాలరీతో పాటు మొత్తం కాస్ట్ టు కంపెనీ (CTC) రూ.26 లక్షలకు పైగా ప్యాకేజీ లభించినట్లు వెల్లడించారు. ఇంత కష్టపడి ఉద్యోగం సాధించినా, అది ఎక్కువ కాలం నిలవలేదని, తాజా లేఆఫ్‌లో ఉద్యోగం పోయినట్లు చెప్పారు. టెక్ రంగంలో ఉద్యోగాల పరిస్థితి ఘోరంగా ఉందని అభిప్రాయపడ్డారు.
భారత్‌లో 1000 మంది లేఆఫ్..?
క్వాల్కామ్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్ని తగ్గించుకుంటోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 3000లకు పైగా ఉద్యోగుల్ని సాగనంపుతోంది. భారత్‌లో 1000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, చెన్నై నగరాల్లో కలిపి క్వాల్కామ్ సుమారు 20,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇదిలా ఉంటే జనవరి 2027లో మరోసారి కోతలు ఉంటాయని కంపెనీ చెబుతోంది.
తాజావార్తలు
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
-
YS Jagan: PPP పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భారీ స్కాం.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!