Site icon NTV Telugu

QNet పై భారీ దాడులు… మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు..!

Qnet

Qnet

QNet: సోమవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ లో పోలీసులు భారీ స్థాయిలో దాడులు చేపట్టారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ QNetపై సిసిఎస్ (CCS) పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ లోనే 25 బృందాలతో పోలీసులు రంగంలోకి దిగి నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. మొత్తం మూడు రాష్ట్రాల్లో సుమారు 25 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

Petrol Price Hike: పెట్రోల్‌, డీజిల్‌పై రూ.55 పెంపు.. అక్కడ రూ.321కి చేరిన లీటర్‌ పెట్రోల్‌ ధర..

హైదరాబాద్‌తో పాటు విజయవాడ, బెంగళూరు, విశాఖపట్నం నగరాల్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో మాత్రమే ఆరు చోట్ల పోలీసులు ఒకేసారి దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 20 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. క్యూ నెట్ సంస్థపై తాజాగా రెండు కేసులు నమోదవడంతో ఈ సోదాలు వేగవంతమయ్యాయి. ఇప్పటికే సిసిఎస్‌లో QNetపై ఆరు కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ కామపీనీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.

MS Dhoni IPL Retirement: ఇదే చివరి సీజనా..? ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్..

Exit mobile version