Site icon NTV Telugu

Qatar Gift Plane: ఇది మామూలు విమానం కాదు.. ఎగిరే ప్యాలెస్‌లా అమెరికా అధ్యక్షుడి గిఫ్ట్

Boeing 747 8 Trump

Boeing 747 8 Trump

Qatar Gift Plane: ఖతార్ రాజకుటుంబం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు బోయింగ్ 747 విమానాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విమానంలో అమెరికా వైమానిక దళం కొన్ని మార్పులు, చేర్పులు చేయడాన్ని ప్రారంభించింది. నిజానికి ఇది మామూలు విమానం కాదు బాస్. ఎరిగే ప్యాలెస్ అంటారు దీనిని. ఇందులో ఉండే సౌకర్యాలు చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. అంత అద్భుతంగా ఉండే విమానాన్ని ఖతార్ రాజకుటుంబం అమెరికా అధ్యక్షుడికి గిఫ్ట్‌గా ఇచ్చింది. అద్భుమైన ఈ విమానానికి మరిన్ని మెరుగులు దిద్ది ప్రెసిడెంట్‌కు ఇవ్వాలని వైమానికి దళం నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ మార్పులు ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం..

READ ALSO: YS Jagan: వైసీపీ శాసనసభాపక్ష సమావేశం.. నేతలకు జగన్‌ దిశానిర్దేశం..

$400 మిలియన్ల ఖర్చుతో..
బహుమతిగా ఇచ్చిన ఈ విమానాన్ని కొత్త ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగించాలనుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాజాగా విమానంలో చేపడతున్న మార్పులకు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి. వేరే దేశం నుంచి వచ్చిన ఈ గిఫ్ట్ విమానంలో అవసరమైన భద్రత, కమ్యూనికేషన్ పరికరాలను తిరిగి అమర్చడం, ఇన్‌స్టాల్ చేయడం కత్తిమీద సామే. తాజాగా భద్రతా సంస్థలు విమానం ఫ్రేమ్ వరకు తొలగించి, అవసరమైన పరికరాలతో పునర్నిర్మించడం ప్రారంభించారు. ఈ విమానాన్ని తిరిగి అమెరికా అధ్యక్షుడికి అనుగుణంగా మార్చడానికి వైమానిక దళానికి $400 మిలియన్ల కంటే తక్కువ ఖర్చు అవుతుందని వైమానిక దళ కార్యదర్శి ట్రాయ్ మెయిన్క్ జూన్‌లో చెప్పారు. తాజాగా చేప్పటిన ఈ ప్రాజెక్టులో సీక్రెట్ సర్వీస్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ ఏజెన్సీతో సహా అనేక ప్రభుత్వ సంస్థలు పాల్గొంటున్నట్లు సమాచారం.

ఈ మార్పుల్లో మొదటి అడుగు ఇంటీరియర్స్, సిస్టమ్‌లను పూర్తిగా తొలగించడంతో ప్రారంభం కానుంది. ప్రతి ప్యానెల్, కేబుల్, ఎలక్ట్రానిక్ భాగం తెలియనిది అంటూ విమానంలో ఏమీ లేదని నిర్ధారించడానికి ఫోరెన్సిక్-స్థాయి తనిఖీకి చేస్తారు. తర్వాత కొత్త టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేస్తారు. తర్వాత ఈ విమానం నిజమైన పునర్నిర్మాణం వైరింగ్ విద్యుత్‌తో సరఫరాతో ప్రారంభం కానుంది. ఇది లగ్జరీ విమానంలా కాకుండా, ఆకాశంలో కమాండ్ సెంటర్‌గా పనిచేయడానికి అవసరైన ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అప్డేట్ పవర్ నెట్‌వర్క్, సురక్షితమైన కమ్యూనికేషన్ టెర్మినల్స్ నుంచి ఏదైనా ప్రయాణీకుల విమానానికి సాధారణంగా అవసరమయ్యే దానికంటే చాలా ఎక్కువ శక్తిని ఉపయోగించే రక్షణ వ్యవస్థల వరకు ప్రతిదీ ఇందులో ఏర్పాటు చేస్తారు.

ఈ విమానంలో సురక్షితమైన వాయిస్, వీడియో, డేటా లైన్‌లు, ఒక రకంగా చెప్పాలంటే డిజిటల్ కోటను సృష్టించనున్నారు. క్యాబిన్‌లోని మొత్తం అన్ని విభాగాలు వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ ఏజెన్సీ వర్క్‌స్పేస్‌లతో అనుసంధానించనున్నారు. ఈ విమానం విమానాశ్రయ పరికరాలపై ఆధారపడకుండా అధ్యక్షుడు ఎక్కడానికి, దిగడానికి ప్రత్యేక ఎయిర్‌మెట్లు ఉన్నాయి. వీటితో పాటు తలుపులు, కిటికీలు, సురక్షితమైన మెడికల్ సూట్‌లను తాజాగా జోడించనున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ విమానంలోని లాంజ్‌లు, డైనింగ్ సెలూన్‌లు, ప్రైవేట్ బెడ్‌రూమ్‌లు వంటి ఖతారీ లగ్జరీ ఫిట్-అవుట్‌లో ఎక్కువ భాగం అధ్యక్షుడి వినియోగానికి అనుకూలంగా మారనున్నాయి. వీటిని ఎలా వచ్చాయో అలానే ఉంచడంతో పాటు చిన్నచిన్న మార్పులు చేయనున్నట్లు సమాచారం. బయటి నుంచి చూస్తే ఇదో సొగసైన జెట్ లాగా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లి చూస్తే.. ఈ విమానం మరో వైట్ హౌస్‌లా కనిపించేలా ఈ కొత్త మార్పులు ఉంటాయని అంటున్నారు అధికారులు.

READ ALSO: Laser Defence: ఇజ్రాయెల్ దారిలో భారత్.. శత్రు వినాశనానికి సరికొత్త అస్త్రం

Exit mobile version