Site icon NTV Telugu

Raksha Bandhan 2025: ప్రధాని మోడీ కోసం రాఖీ సిద్ధం చేసిన పాక్ ముస్లిం సోదరి ఖమర్ మొహ్సిన్ షేక్..

Modi

Modi

మరో మూడు రోజుల్లో రాఖీ పండుగ రాబోతోంది. అన్నా చెళ్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు చిహ్నంగా రక్షబంధన్ నిలుస్తోంది. ఈ ఏడాది కూడా రాఖీ పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రక్షా బంధన్ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముస్లిం సోదరి ఖమర్ మొహ్సిన్ షేక్ మరోసారి ఆయన కోసం రాఖీని సిద్ధం చేశారు. పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించిన ఖమర్ షేక్ గత 30 సంవత్సరాలుగా ప్రధాని మోడీకి రాఖీ కడుతున్నారు. ఈ సంవత్సరం ఆమె తన చేతులతో ఓం, గణేష్ జీ డిజైన్లతో నాలుగు రాఖీలను తయారు చేసింది. రాఖీ కట్టేందుకు ఆమె పీఎంఓ ఆహ్వానం కోసం ఎదురుచూస్తోంది.

Also Read:Satya Kumar Yadav: డాక్టర్‌ సమరం పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్‌.. అప్పట్లో చాటుగా స్వాతి బుక్ చదివేవాళ్లం..!

ప్రతి సంవత్సరం తాను స్వయంగా రాఖీలు తయారు చేస్తానని, తనకు అత్యంత ఇష్టమైన రాఖీని ప్రధాని మోడీ చేతికి కడతానని ఖమర్ మొహ్సిన్ షేక్ చెప్పారు. మోడీ జీ సంఘ్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునని ఆమె చెప్పింది. ఒకసారి ప్రధాని మోడీ తన క్షేమం గురించి అడిగి, ‘సోదరి ఎలా ఉన్నారు?’ అని అడిగారు. అప్పటి నుంచి ఆమె అతనికి రాఖీలు కట్టడం ప్రారంభించింది. ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని తాను ఒకసారి ప్రార్థించానని ఖమర్ షేక్ చెప్పారు.

Also Read:Mohammed Siraj: హైదరాబాద్‌లోనే కాదు, ఎక్కడున్నా సిరాజ్కి బిర్యానీ!

అప్పుడు ప్రధాని నవ్వారని తెలిపింది. ఈ కోరిక నెరవేరినప్పుడు, మీరు దేశానికి ప్రధానమంత్రి అయి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించినట్లు తెలిపింది. తన కోరిక ఇప్పుడు మూడోసారి నెరవేరిందని ఆమె చెబుతోంది. గత సంవత్సరం తాను ఢిల్లీకి వెళ్లలేకపోయానని, కానీ ఈ సంవత్సరం తనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం వస్తుందని, రాఖీ కట్టి రక్షాబంధన్ జరుపుకోగలనని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.

Exit mobile version