NTV Telugu Site icon

Viral Video: స్కూటీ డిక్కీలో కొండచిలువ ప్రత్యక్షం..వీడియో వైరల్

New Project (11)

New Project (11)

వర్షాకాలంలో పాములు తరచూ కనిపిస్తుంటాయి. ఈ మధ్య పాములు కారు ఇంజన్ లేదా ట్రంక్ దగ్గర, బైక్ లలో దాక్కొని ఉండటాన్ని వీడియోలలో చూస్తుంటాం. నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పాము విషపూరితమైనది. అజాగ్రత్తగా ఉంటే ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోవచ్చు. అయితే తాజాగా నెట్టింటా ఓ వీడియో వైరల్ గా మారింది. ఓ కొండ చిలువ స్యూటీ డిక్కీలో చొరబడింది. బుస్సు..బుస్సు మంటూ శబ్ధం వస్తుండటంతో వాహనదారుడు తెరిచి చూడగా పాము ప్రత్యక్షమైంది.

READ MORE: NEET: నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశం

సరీసృపాలలో కొండచిలువలు చాలా అరుదు. ఈ వైరల్ వీడియోలో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. వర్షాకాలంలో ఆశ్రయం పొందేందుకు కొండచిలువ ద్విచక్ర వాహనం ట్రంక్‌ను ఎంచుకుంది. ఈ వీడియో ఓ వ్యక్తి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. ఇందులో ఓ వ్యక్తి బైక్ డిక్కీని తెరుస్తూ కనిపించాడు. ఆ ట్రంక్‌ని తెరుస్తున్న వ్యక్తికి బహుశా అందులో ఏదైనా ప్రమాదకరమైన జీవి ఉండవచ్చనే ఆలోచన ఉండవచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి, అతను కర్ర సహాయంతో ట్రంక్‌ను తెరుస్తాడు. ట్రంక్ తెరవగానే తాళం హుక్ దగ్గర ప్రమాదకరమైన కొండచిలువ కనిపించింది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది బేబీ కొండచిలువ, దీనిని ఇండియన్ రాక్ పైథాన్ అని పిలుస్తారని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. కానీ ఈ వీడియో ఏ ప్రదేశానికి చెందినదన్న వివరాలు తెలియరాలేదు. వాహనదారులు ఈ వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ద్విచక్రవాహనాన్ని బయటకు తీసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం మంచిది.