Site icon NTV Telugu

PV Sindhu: పివి సింధు సేఫ్.. క్షేమంగా భారత్ కు రాక..!

Pv Sindhu

Pv Sindhu

PV Sindhu: మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల దుబాయ్‌ లో చిక్కుకుపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఈ భయంకరమైన అనుభవం తర్వాత ఆమె బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె తెలిపింది.

Israel-Khamenei: ఖమేనీ జాడను ఇజ్రాయెల్ ఎలా కనిపెట్టింది? వెలుగులోకి సంచలన విషయాలు

పి.వి. సింధు తన టీమ్ & కోచ్ ఇర్వాన్ష్యా ఆది ప్రతాపాతో కలిసి దుబాయ్‌లో చిక్కుకుపోయారు. వారు బస చేసిన ప్రాంతానికి సమీపంలోనే పేలుడు సంభవించడంతో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఆ తర్వాత వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినప్పటికీ.. విమాన రాకపోకల నిలిపివేత, ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దుబాయ్ గగనతలం, విమానాశ్రయం మూసివేయడంతో.. సింధు ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

తొలి రౌండ్‌ లో థాయ్‌లాండ్‌ కు చెందిన సుపనిద కతేథాంగ్‌ తో ఆమె తలపడాల్సి ఉంది. ఓమన్ మీదుగా రోడ్డు మార్గంలో ప్రయాణించాలని ఆలోచించినప్పటికీ, అది చాలా ప్రమాదకరమని భావించి ఆ ప్లాన్‌ను విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో సురక్షితంగా ఇంటికి చేరుకున్న తర్వాత సింధు ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. అందులో తాను సురక్షితంగా బెంగళూరు చేరుకున్నాను. గత కొన్ని రోజులు చాలా ఉత్కంఠగా గడిచాయని పేర్కొన్నారు.

IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

దుబాయ్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ విభాగం, తమను సురక్షితంగా భారత్ తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుని, తర్వాతి గురించి ఆలోచిస్తానని ఆమె వెల్లడించారు. ఇక మాజీ భారత కోచ్ విమల్ కుమార్ మాట్లాడుతూ.. సింధు ఈ టోర్నీలో పాల్గొనలేకపోవడంపై చాలా నిరాశ చెందిందని తెలిపారు. ఆమె చాలా ఫామ్‌లో ఉందని.. కానీ, విధిని ఎవరూ మార్చలేరని, రాబోయే రోజుల్లో సూపర్ 1000 లేదా ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలపై దృష్టి సారించాలని ఆమెకు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.

Exit mobile version