Site icon NTV Telugu

Puvvada Ajay Kumar : రేణుక చౌదరిపై న్యాయ పోరాట చేస్తా

Puvvada

Puvvada

కాంగ్రెస్ నేత మాజీ మంత్రి రేణుక చౌదరి పై మంత్రి పువ్వాడ అజయ్ నిప్పులు చెరిగారు. రేణుక చౌదరిపై న్యాయ పోరాట చేస్తానన్నారు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవాకులు చవాకులు పేలితే జాగ్రత్త అని అన్నారు. సీట్లు ఇప్పిస్తాననిగిరిజనుల వద్ద డబ్బులు వసూలు చేసుకోవడం ఆమె హాబీ అని మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా రేణుక చౌదరి పువ్వాడని టార్గెట్ చేసుకొని మాట్లాడుతుంది. పువ్వాడ అజయ్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది తానేనని అంటుంది.

Also Read : Flights Safe Land: గాల్లో అంతరాయం.. రెండు విమానాలకు తప్పిన ప్రమాదం

ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ఆత్మీయ ప్లీనరీ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ రేణుక చౌదరి అవాకులు చవాకులు పేలుతున్నదని, సభ్యత లేకుండా మాట్లాడుతున్నదని ఆమె మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేనని నాకు మా తండ్రి మా పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత నేర్పించాలని అన్నారు. రేణుక చౌదరి ఎన్నికల అప్పుడు జిల్లాకి రావడం సీట్లు ఇప్పిస్తానని గిరిజనుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఆమెకు అలవాటని ఆరోపించారు .గత ఏడాది కాలం నుంచి తనపై రేణుక చౌదరి విమర్శలు చేస్తుంటే మా మహిళలు కూడా చాలా ఓపికతో ఉన్నారని ఇదే పరిస్థితి కొనసాగితే రేణుక చౌదరిపై న్యాయపోరాటం చేస్తానని పువ్వాడ జై స్పష్టం చేశారు. రేణుక చౌదరి కుటుంబం సభ్యులు క్లబ్బులకే పరిమితమైందని కూడా ఆరోపించారు.

Also Read : Gopichand: ఆయన గొప్పోడు.. నువ్వేం పీకావ్.. హీరోకు డైరెక్టర్ సూటి ప్రశ్న

Exit mobile version