Site icon NTV Telugu

Puvvada Ajay Kumar : ప్రజలు ఆగం కావద్దు.. టక్కు టమరా గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తారు…

Puvvada

Puvvada

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార విపక్షాల నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అయితే.. ఇవాళ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఎచ్చి పొచ్చి నా కొడుకులు కళ్ళు తెరచి చూడండిరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాల వాళ్ళైతే ఆర్టీసీని అమ్మేసేవారని, ఆర్టీసీని ఆదుకోవాలని ఆర్టీసీ పేరిట పెట్రోల్ బంక్ లు నడుపుతున్నామన్నారు పువ్వాడ అజయ్‌. నా హయాంలోనే ఈ నిర్మాణం పూర్తి అవుతుందని, ప్రజలు ఆగం కావద్దు…. టక్కు తమరా గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తారని ఆయన మండిపడ్డారు.

Also Read : Amit Shah: ఇండియా కూటమి హిందూమతాన్ని ద్వేషిస్తోంది.. సీఎం కొడుకు వ్యాఖ్యలపై ఫైర్..

అంతేకాకుండా.. ‘తట్టెడు మట్టి పోయాని వారు మాట్లాడుతున్నారు… మీ మాటలు వినడానికి ఖమ్మం ప్రజలు పిచ్చివాళ్ళు కాదు…. ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా… గతంలో పదవులు చేపట్టిన వారు ఖమ్మం కు ఏమీ అభివృద్ధి చేయలేదు…. మా దగ్గర చాంతాడు అంత అభివృద్ధి లిస్ట్ ఉంది… మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతున్నాడు….. ఖమ్మం జిల్లా నాయకులకు కేసీఆర్ ఎంత చేయాలో అంత సహాయం చేసాడు…. కడుపులు నిండిన నాయకులు బయటకు వెళ్లి పిచ్చికూతలు కూస్తున్నారు..’ అని పువ్వాడ అజయ్‌ వ్యాఖ్యానించారు.

Also Read : Daggubati Purandeswari: అధికార పార్టీపై పురందేశ్వరి ఫైర్.. అప్పుల విషయంలో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్

Exit mobile version