Site icon NTV Telugu

Putin: రష్యా అధ్యక్షుడు ప్రతిసారి డిసెంబర్‌లోనే భారత్‌ను ఎందుకు సందర్శిస్తారు?

Putinapology

Putinapology

Russian President Vladimir Putin will visit India on December: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. పుతిన్ పర్యటన కోసం భారతదేశంలో సన్నాహాలు జరుగుతున్నాయి. రష్యా సైనిక బృందం చాలా రోజుల క్రితం వచ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తోంది. అయితే.. ఇంతలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. గత 10 సంవత్సరాలుగా పుతిన్ భారత్ సందర్శించిన తీరు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. పదేళ్లలో పుతిన్ ప్రతి పర్యటన ఏడాది చివరిలో కొనసాగింది. దీని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుందాం..

READ MORE: Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!

గతంలో రష్యా అధ్యక్షుడి పర్యటనల చరిత్రను పరిశీలిస్తే.. పుతిన్ ఇప్పటివరకు 10 సార్లు భారతదేశాన్ని సందర్శించారు. ఆయన తొలిసారిగా 2000 అక్టోబర్‌లో భారత్‌ను సందర్శించారు. ఆ సమయంలో రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. అనంతరం వరుసగా డిసెంబర్ 2002, డిసెంబర్ 2004, జనవరి 2007, మార్చి 2010, డిసెంబర్ 2012, డిసెంబర్ 2014, అక్టోబర్ 2018, డిసెంబర్ 2021లలో భారతదేశాన్ని సందర్శించారు. కొన్ని సందర్భాలు మినహా ఎక్కువగా డిసెంబర్‌లోనే భారత్‌ను సందర్శించారు. భారత్-రష్యా మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశం డిసెంబర్‌లో జరగడమే దీనికి ప్రధాన కారణం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ దాదాపు శిఖరాగ్ర సమావేశాల కోసమే భారతదేశాన్ని సందర్శించారు.

READ MORE: నేడే POCO C85 5G లాంచ్.. భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, ఇంకా మరెన్నో.. బడ్జెట్ లోనే గురూ..!

Exit mobile version