Site icon NTV Telugu

Puspa 2 Srivalli: పుష్ప గాడి పెళ్ళాం అంటే ఆ మాత్రం ఉండాల..!

1.1

1.1

నేడుపుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ రష్మిక మందాన నటిస్తున్న పుష్ప – 2 నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బంధం. చిత్ర నిర్మాతలు దాని అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో నేడు శ్రీవల్లిగా రష్మిక నటిస్తున్న పోస్టర్ ను విడుదల చేశారు. రష్మిక ఈ ఫోటోలో ఆకుపచ్చని చీరని కట్టుకొని, భారీగా బంగారం ఆభరణాలను ధరించి మెస్మరైజ్ చేస్తోంది. ఇకపోతే హీరోయిన్ తలపై సింధూరం ధరించడం కూడా కనబడుతుంది.

Also Read: RBI Repo Rate: ఆర్‌బీఐ వడ్డీరేట్లు యథాతథం.. వరుసగా ఇది ఏడోసారి!

ఇకపోతే పుష్ప 2 ది రూలర్, సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుందని ఇప్పటికే చిత్ర బృందం తెలిపిన సంగతి తెలిసిందే. కాకపోతే ప్రస్తుతం దేశంలోని ఎలక్షన్ల కారణంగా ఈ సినిమా కాస్త ఆలస్యం అయ్యేటట్లు కనపడుతుంది. పుష్పా సినిమా మొత్తం మూడు భాగాలలో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించబోతున్నాడు. పుష్ప మొదటి భాగం సంబంధించి ఇప్పటికే అనేక అవార్డులను గెలుచుకుంది. ఇక హీరో అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డును దక్కించుకున్నాడు. చూడాలి మరి పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని వండర్స్ ను క్రియాట్ చేస్తుందో..

Also Read: Uber Auto Charges: వామ్మో.. మరోసారి ఆటో చార్జికి ‘కోట్లు’ అడుగుతున్న ఉబర్..!

Exit mobile version