NTV Telugu Site icon

Viral: ఇలా తయారేంట్రా బాబు.. ‘పుష్ప-శ్రీవల్లి’ వినాయకుడంట చూశారా..?

Puspa 2

Puspa 2

Puspa 2 idol viral photo: సెప్టెంబర్ 7, 2024న హిందువులు భారతదేశ వ్యాప్తం మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. ఇప్పటికే గణేష్ మండపాలను తయారుచేసి విగ్రహాలను కొలువ చేర్చేందుకు ఆయా కమిటీ వర్గ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇకపోతే., వినాయకచవితి సందర్బంగా చేసే వినాయక విగ్రహాల నేపథ్యంలో ఒక్కొక్కరు ఒకోరకమైన అభిరుచిని కలిగి ఉండడం సహజం. కొంతమంది పొడవైన వినాయకుడిని ప్రతిష్టించాలని.. మరికొందరేమో ఎకో ఫ్రెండ్లీ వినాయకులను ఏర్పాటు చేయాలంటూ వివిధ రకాల ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు. మరికొందరేమో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న పనులకు సంబంధించి విషయాలను పోలుస్తూ విగ్రహాలను తయారు చేయించడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం. ఇకపోతే., తాజాగా కొందరు పుష్ప 2 సినిమాలోని సంబంధించి ఓ వినాయక రూపాన్ని రూపొందించారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Viral Video: ఇంట్లోకి దూరిన 11 అడుగుల కింగ్‌ కోబ్రా.. అంత ఈజీగా ఎలా పట్టావయ్యా! వీడియో చూస్తే వణకాల్సిందే

ఇప్పటికే వినాయక చవితికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో విగ్రహాల అమ్మకాలు జోరుగా అందుకున్నాయి. పలు థీమ్ లతో తయారు చేసే విగ్రహాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ముంబై వంటి పెద్ద నగరాలలో కొత్త కొత్త రకాల థీమ్ తయారు చేసే వినాయకులను చూడడానికి ప్రజలు తెగ ఉత్సాహం చూపుతున్నారు. ఈ నిమిషంలోనే పుష్ప 2 సినిమాలోని అల్లు అర్జున్, రష్మిక తరహాలో ఉన్న విగ్రహం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. హీరోలపై అభిమానం ఉండాలి కానీ.. మరి ఇలా అభిమానం పేరుతో దేవుళ్లను పిచ్చిపిచ్చిగా తయారు చేయవద్దని నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show comments