Pushpa 2 : హాలీవుడ్ బ్లాక్ బస్టర్ కలెక్షన్లను క్రాస్ చేసిన పుష్ప 2
- హాలీవుడ్ చిత్రాన్ని క్రాస్ చేసిన పుష్ప కలెక్షన్లు
- నార్త్ అమెరికాలో జోరు చూపిస్తున్న పుష్పరాజ్
- వేగంగా రూ.800కోట్లు అందుకున్న సినిమాగా రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బన్నీ హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ రైటింగ్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ వారాంతానికి ఈ మూవీ కలెక్షన్స్ 800 కోట్లు క్రాస్ అవుతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తక్కువ సమయంలో వేగంగా రూ.1000 కోట్ల క్లబ్ లో నిలిచిన సినిమాగా ఈ మూవీ చరిత్ర సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ కి ముందే రూ.1000 కోట్ల కలెక్షన్స్ ని ‘పుష్ప 2’ అందుకునే అవకాశం ఉండకపోవచ్చని సందేహాలు వ్యక్తం చేశారు. కానీ కేవలం 4 రోజుల్లోనే రూ.600 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం ద్వారా అందరి సందేహాలకు పుష్ప రాజ్ పుల్ స్టాప్ పెట్టింది. యూఎస్ లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ఒక్క నార్త్ అమెరికాలోనే ఈ మూవీ నాలుగు రోజుల్లో 8 మిలియన్ డాలర్స్ సాధించింది.
Read Also : Telangana Assembly 2024: తెలంగాణ తల్లికి అధికార గుర్తింపు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి..
Also Read
దీనిని బట్టి సినిమాకి వస్తున్న స్పందన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్ మూవీ ‘ఇంటర్ స్టెల్లర్ తాజాగా రీరిలీజ్ అయ్యింది. అయితే ‘పుష్ప 2’ని వదులుకుని ‘ఇంటర్ స్టెల్లర్’ సినిమాకి ఐమ్యాక్స్ థియేటర్స్ ఇవ్వడానికి ఎవరూ సాహసం చేయలేదు. దీంతో ఆ మూవీ ఇండియాలో విడుదల వాయిదా పడింది. అయితే యూఎస్ లో మాత్రం గ్రాండ్ గానే రీరిలీజ్ అయ్యింది. అయితే యూఎస్ లో ‘ఇంటర్ స్టెల్లర్’ కంటే ‘పుష్ప 2’ కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. బాక్సాఫీస్ మోజో లెక్కలు ఈ విషయాన్ని కన్ఫాం చేశాయి. ‘పుష్ప 2’ ప్రస్తుతం నార్త్ అమెరికా బాక్సాఫీస్ ర్యాంకింగ్స్‌లో నాల్గవ స్థానంలో ఉందని తెలుస్తోంది. దీనికంటే ముందు ‘మోనా 2’, ‘వికెడ్’ ‘గ్లాడియేటర్ 2’ ఉన్నాయి. పుష్ప 2 మూవీ 1,245 థియేటర్‌లలో 1,700,000డాలర్ల కలెక్షన్స్ అందుకుంది. ‘ఇంటర్‌స్టెల్లర్’ మూవీ 165 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ నుండి 1,370,000డాలర్లను కలెక్ట్ చేసింది. కేవలం ఐమాక్స్ థియేటర్స్ లలో మాత్రమే ‘ఇంటర్ స్టెల్లర్’ సినిమాని రీరిలీజ్ చేశారు. ఈ కలెక్షన్స్ బట్టి ‘పుష్ప 2’కి నార్త్ అమెరికాలో ఏ స్థాయిలో ఆదరణ వస్తుందో అంచనా వేయవచ్చు.
Read Also : Telangana Assembly Sessions 2024: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!