Pushpa 2 : పుష్ప ఎన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుందంటే..!
- బన్నీ సుక్కు కాంబోలో వస్తున్న పుష్ప 2
- భారీ ఎత్తున విడుదల కానున్న పుష్ప 2
- గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Tollywood : ఈ ఏడాది టాలీవుడ్‌ను పలకరించని బ్యూటీల లిస్ట్ పెద్దదే
Also Read
కాగా నేడు పుష్ప ప్యాన్ ఇండియాప్రమోషన్స్ లో భాగంగా ముంబై లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. రష్మిక తో పాటు చిత్ర నిర్మాతలు మైత్రీ నవీన్, రవిలు కూడా హాజరయ్యారు. బాలీవుడ్ మీడియాతో నిర్మాతలు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిర్మాత రవి మాట్లాడుతూ ‘ పుష్ప రిలీజ్ కు అన్ని ఏర్పాట్లుచేసాం. ఈ సినిమాను భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా డిసెంబరు 5న 12,000 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. మొత్తంగా ఆరుభాషల్లో రిలీజ్ చేస్తున్నాం, ఐమాక్స్ వెర్షన్లో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్న ఇండియన్ సినిమా పుష్ప -2. అని అన్నారు. కాగా డిసెంబరు 1న ఈ సినిమాలోని పీలింగ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్ తో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ మరోసారి చూస్తారని యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా U/A సర్టిఫికేట్ తో విడుదల అవుతోంది.
#Pushpa2TheRule will release in 12,000+ screens across the world 💥💥
The film will have the biggest release ever in IMAX version for an Indian Film 🔥🔥
Audience can enjoy the film in all the 6 languages across the globe using the Cinedubs App.
Watch #Pushpa2IconicPressMeet… pic.twitter.com/zwKtiUeYHc
— AGS Entertainment (@Ags_production) November 29, 2024
తాజావార్తలు
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!