NTV Telugu Site icon

Pushpa 2 : పుష్ప ఎన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుందంటే..!

Pushpa2 (4)

Pushpa2 (4)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Tollywood : ఈ ఏడాది టాలీవుడ్‌ను పలకరించని బ్యూటీల లిస్ట్ పెద్దదే

కాగా నేడు పుష్ప ప్యాన్ ఇండియాప్రమోషన్స్ లో భాగంగా ముంబై లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. రష్మిక తో పాటు చిత్ర నిర్మాతలు మైత్రీ నవీన్, రవిలు కూడా హాజరయ్యారు. బాలీవుడ్ మీడియాతో నిర్మాతలు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిర్మాత రవి మాట్లాడుతూ ‘ పుష్ప రిలీజ్ కు అన్ని ఏర్పాట్లుచేసాం. ఈ సినిమాను భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా డిసెంబరు 5న 12,000 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. మొత్తంగా ఆరుభాషల్లో రిలీజ్ చేస్తున్నాం, ఐమాక్స్ వెర్ష‌న్‌లో ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న ఇండియ‌న్ సినిమా పుష్ప -2. అని అన్నారు. కాగా డిసెంబరు 1న ఈ సినిమాలోని పీలింగ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్ తో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ మరోసారి చూస్తారని యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా U/A సర్టిఫికేట్ తో విడుదల అవుతోంది.

Show comments