NTV Telugu Site icon

Puspa 2 Collections: తగ్గేదేలే.. కొనసాగుతున్న పుష్ప కలెక్షన్ల రికార్డుల పరంపర..

Puspa2

Puspa2

Puspa 2 Collections: “పుష్ప-2 ది రూల్” సినిమా బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తోంది. కాకపోతే, ఈ సినిమా నాలుగో సోమవారం వసూళ్లు భారీగా తగ్గాయి. ఈ సినిమా 26వ రోజు వసూళ్లు చూస్తే ఇప్పటి వరకు వసూళ్లలో తక్కువగా ఉన్నాయి. అయితే, కొత్త సంవత్సరంలో మళ్లీ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే, ‘పుష్ప 2’ 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1750 కోట్ల రూపాయలను క్రాస్ చేసిందని మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ లెక్క ప్రకారం ఈ సినిమా అతి త్వరలో ప్రపంచ వ్యాప్తంగా రూ.2000 కోట్లు సులువుగా రాబట్టవచ్చు.

Also Read: Pawan Kalyan: తండ్రికి తగ్గ తనయులు.. కాశీలో సామాన్యుల్లా ఆటోలో ప్రయాణం చేసిన డిప్యూటీ సీఎం పిల్లలు

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద స్పీడ్ తగ్గుతోంది. ‘పుష్ప 2’ మొదటి వారంలో 725.8 కోట్లు, రెండవ వారంలో 264.8 కోట్లు, మూడవ వారంలో 129.5 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం నాలుగో శుక్రవారం రూ.8.75 కోట్లు, నాలుగో శనివారం రూ.12.5 కోట్లు, నాలుగో ఆదివారం రూ.15.65 కోట్లు రాబట్టింది. నాలుగో వారాంతం ముగిసిన 26వ రోజు ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.6.65 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన అత్యల్ప వసూళ్లు ఇదే. దీంతో అల్లు అర్జున్ సినిమా 26వ రోజు వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.1163.65 కోట్లు రాబట్టింది.

Show comments