NTV Telugu Site icon

Pushpa 2 : “పుష్ప 2” సెకండ్ సింగిల్ అదిరిపోనుందా..?

Alluarjun .

Alluarjun .

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప2”.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.తాజాగా ఈ చిత్రం నుండి మేకర్స్ ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు .”పుష్ప పుష్ప” అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.రికార్డు వ్యూస్ తో అదరగొడుతుంది.

Read Also :Bachhala Malli : అల్లరి నరేష్ “బచ్చల మల్లి” ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..

ఇదిలా ఉంటే ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ పై మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన సెకండ్ సాంగ్ ప్రోమో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది..’సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి “అంటూ సాగె ఈ సాంగ్ ను స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ ఆలపించారు.ఈ పాటను ఆమె తమిళ్ ,హిందీ ,తెలుగు ,కన్నడ ,మలయాళం ,బెంగాలీ భాషల్లో పాడింది.ఈ పాటను రేపు ఉదయం 11 .07 గంటలకు మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.తాజాగా ఈ సాంగ్ కు సంబంధించి మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఇండియాలోనే మోస్ట్ ఫేవరెట్ జోడి పుష్ప రాజ్ ,శ్రీవల్లీ మిమ్మల్ని అలరించడానికి వచ్చేస్తున్నారు అని చిత్ర యూనిట్ ఆ పోస్టర్ లో తెలిపింది.ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.పుష్ప 2 నుంచి వస్తున్న ఈ కపుల్ సాంగ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది అని మేకర్స్ ధీమాగా వున్నారు.మరి రేపు రిలీజ్ అయ్యే ఈ కపుల్ సాంగ్  ఎలా ఉంటుందో చూడాలి .