Pushpa 2 OTT: రిలీజ్ కి ముందే పుష్ప 2 సెన్సేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 OTT: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తీసిన పుష్ప సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ సినిమాలోని పాటలు కూడా ఆ రేంజ్ లోనే పాపులర్ అయ్యాయి. హీరో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమా తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో సూపర్ హిట్ సాధించి మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కి నేషనల్ లెవల్లో కొత్త అభిమానులు యాడ్ అయ్యారు. ఇక కలెక్షన్స్ పరంగా హిందీలో ఈ సినిమా రూ. వంద కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లు రాబట్టింది. ఇప్పుడు చిత్రం రెండవ భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్.
Read Also: NTR30: వేట మొదలుపెట్టిన తారక్.. వీడియో వైరల్
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ మొదలు పెట్టి చాలా రోజులైనా సినిమా అప్డేట్ ఇవ్వలేదని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిరాశలో ఉన్న అభిమానుల కోసం డైరెక్టర్ సుకుమార్ గుడ్ న్యూస్ చెప్పేశాడు. పుష్ప సినిమా అప్డేట్స్ వస్తున్నాయి అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా మూవీ టీజర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి భాగంతో దేశవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించిన పుష్ప రాజ్.. సెకండ్ పార్ట్ తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడో వేచి చూడాలి. పుష్ప 2కు ఓటీటీ రైట్స్ కోసం భారీగా పోటీ జరుగుతోందని టాక్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 200 కోట్లు కోట్ చేస్తున్నారట. ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూ. 200 కోట్లు ఇచ్చయినా సరే పుష్ప 2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని సమాచారం. మరి రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.
- Tags
- allu arjuns
- film
- netflix
- OTT
- ott rights
తాజావార్తలు
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్‌పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!