Pushpa2 Rights : ఇండియా అయినా అమెరికా అయినా పుష్ప గాడు దిగనంతవరకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 మేనియా ప్రపంచవ్యాప్తంగా పాకింది.. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమా పై బజ్ ను క్రియేట్ చేస్తే.. నిన్న విడుదలైన సాంగ్ సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తుంది… ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15 న థియేటర్లలోకి రిలీజ్ అవ్వబోతుంది..
గతంలో 2021లో వచ్చిన ‘పుష్ప1: ది రైజ్’ సినిమా దేశాన్ని ఊపేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. ముఖ్యంగా తెలుగుకు మించి హిందీలో ఉత్తర భారతంలో ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. అల్లు అర్జున్ యాక్షన్, స్వాగ్, మేనరిజమ్స్ హిందీ తో పాటు, అమెరికా జనాలకు చాలా నచ్చేశాయి. దీంతో ఆ మూవీ సీక్వెల్ ‘పుష్ప 2’ సినిమాపై అక్కడ కూడా భారీ క్రేజ్ ఏర్పడింది..
Also Read
పుష్ప 2: ది రూల్ మూవీ నార్త్ అమెరికా థియేట్రికల్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యాంగిర మరియు ఏఏ క్రియేషన్స్ ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ రైట్స్ కోసం ఏకంగా రూ.60 కోట్లను చెల్లించారని తెలుస్తోంది.. ఇది మామూలు విషయం కాదు.. అమెరికాలో పుష్ప 2 కు ఉన్న క్రేజ్ చూస్తే ఆ వసూళ్లు అలవోకగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త రికార్డులను సొంతం చేసే అవకాశాలు ఉన్నాయి.. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, జగదీష్ ప్రతాప్ బండారీ, ప్రకాశ్ రాజ్, అనసూయ కీరోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు..
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!