Site icon NTV Telugu

Purushaha Teaser: నవ్వకుండా ఉండలేరంతే.. పురుషః టీజర్ చూసేయండి..!

Purushaha Teaser

Purushaha Teaser

Purushaha Teaser: ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న పురుషః (Purushaha) ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై నెట్టింట వైరల్ అవుతోంది. భార్యాభర్తల మధ్య జరిగే సరదా గొడవలు, పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలను దర్శకుడు వీరు వులవల ఎంతో వినోదాత్మకంగా మలిచారు.

అల్ట్రా స్లిమ్ బాడీ, లైట్‌వెయిట్ డిజైన్‌తో జనవరి 19న ఎంట్రీ ఇవ్వనున్న HONOR Magic8 Pro Air..!

వైష్ణవ్‌ తేజ్ ‘ఉప్పెన’, ఎన్టీఆర్ ‘పెద్ది’ చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే.. పెళ్లి తర్వాత పురుషుల జీవితం ఎలా తలకిందులు అవుతుందనే అంశాన్ని కామెడీ జోడించి చూపించినట్లు అర్థమవుతోంది. కేవలం నవ్వులే కాకుండా.. సంసారంలో భార్యల ప్రాముఖ్యత ఏంటనేది కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు.

డాక్టర్ అవసరం లేకుండా ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఇవే!

ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ (బత్తుల) హీరోగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. మొదటి సినిమా అయినప్పటికీ పవన్ తన టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు నటిస్తుండగా.. పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ జోడీలుగా కనిపించి వినోదాన్ని పంచనున్నారు. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ కామెడీ తారాగణం ఉంది. వెన్నెల కిశోర్, విటివి గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్, జబర్దస్త్ వినోద్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఇంకెందుకు ఆలశ్యం అవుట్ అండ్ అవుట్ కామెడీ టీజర్ ఇక్కడ చూసేయండి..

Exit mobile version