NTV Telugu Site icon

Puri Jagannadh : ఊహించని హీరోను పట్టేసిన పూరీ జగన్నాథ్

New Project 2024 11 07t071059.648

New Project 2024 11 07t071059.648

Puri Jagannadh : డ్యాషింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ టైం ప్రస్తుతం అస్సలు బాగోలేదు. ఆయన బంగారం పట్టుకున్న గులకరాళ్ల అయిపోతున్నాయి. ఒకప్పుడు ఎలాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడో.. ప్రస్తుతం తననుంచి అలాంటి ఇండస్ట్రీ డిజాస్టర్లు వస్తున్నాయి. ‘ఇస్మార్ట్ శంక‌ర్’ త‌ర్వాత పూరీని ప‌రాజ‌యాలు వెంటాడుతున్నాయి. ‘లైగ‌ర్’, ‘డ‌బుల్ ఇస్మార్ట్’ తో బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్లు పడ్డాయి. ‘లైగ‌ర్’ ప్లాప్ కారణంగా విజ‌య్ దేవ‌ర‌కొండ తన అప్ క‌మింగ్ ప్రాజెక్ట్ జ‌న‌గ‌ణ‌మ‌న‌ని సైతం పూరీతో క్యాన్సిల్ చేసుకున్నాడు. డ‌బుల్ ఇస్మార్ట్ బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని ప్రయత్నించినా అది వర్కవుట్ కాలేదు. దీంతో పూరి త‌దుప‌రి హీరో ఎవరన్న చర్చ ఆసక్తికరంగా మారింది.

Read Also:Bank FD Scheme: 7.55% వడ్డీ రేటుతో అదిరిపోయే ఎఫ్‭డి స్కీములను తీసుకొచ్చిన ఇండియన్ బ్యాంకు

ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో అయితే పూరితో స్టార్ హీరోలెవ‌రూ సినిమాలు చేయ‌డానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. టైర్-2 హీరోలు సైతం రిస్క్ తీసుకునే అవకాశం అయితే కనిపించడం లేదు. పైగా పూరి ఇంకా ఓల్డ్ ఫార్మెట్ లోనే సినిమాలు చేస్తున్నాడు? అందుకే వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఈ కార‌ణంగా హీరోలను వెతుక్కునే పరిస్థితి పూరీకి ఏర్పడింది. మ‌రి ఇలాంటి ఫేజ్ లో పూరి ఆప్షన్ ఎవరు ? అంటే ఓ హీరో పేరు వినిపిస్తోంది. అత‌డే సందీప్ కిష‌న్. న‌టుడిగా సందీప్ చాలా సినిమాలు చేశాడు.

Read Also:Virat Kohli: అయ్యో విరాట్‌ ఎంతపనాయే.. పదేళ్లలో ఇదే తొలిసారి!

కానీ హీరోగా తనకు కెరీర్ కు ఉపయోగపడే విధంగా సరైన సక్సెస్ లు మాత్రం పడలేదు. ఆయన ట్యాలెంటెడ్ న‌టుడైనా ఎక్కడో త‌ప్పిదం అత‌డిని వెన‌క్కి లాగుతోంది. ఈ నేప‌థ్యంలో వారిద్దరినీ కలపడానికి పూరీ స్నేహితుడు సందీప్ కిషన్ మేనమామ శ్యామ్.కె. నాయుడు రంగంలోకి దిగిన‌ట్లు స‌మాచారం. వీళ్లిద్దరి కాంబోలో ఓ సినిమా సెట్ చేస్తున్నాడుట‌. పూరి స‌రైన క‌థ రాస్తే క‌టౌట్ అవ‌స‌రం లేదు. అత‌డి క‌థే హీరోగా మారిపోతుంది. ఇండ‌స్ట్రీకి వార‌సులను పరిచయం చేసి స్టార్ డమ్ అందించిన ఘ‌న‌త అత‌ని సొంతం. హీరోల‌కు మాస్ ఇమేజ్ ఇవ్వడంలోనూ పూరీ తర్వాతే ఎవరైనా. అందుకే శ్యామ్. కె. నాయుడు ఇప్పుడు మేన‌ల్లుడు కోసం పూరిని రంగంలోకి దించుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. పైగా పూరి-శ్యామ్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు.

Show comments