Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Puri Jagannath Temple Ratna Bhandagaram Opened After 46 Years Whats Inside

Puri Ratna Bhandar: తెరుచుకున్న జగన్నాథ ఆలయ రత్న భాండాగారం.. లోపల ఏముందో తెలుసా..?

Published Date :July 14, 2024 , 4:15 pm
By Rajesh Veeramalla
  • తెరుచుకున్న జగన్నాథ ఆలయ రత్న భాండాగారం
  • 46 ఏళ్ల కిందట తెరిచిన రత్న భాండాగారం.
Puri Ratna Bhandar: తెరుచుకున్న జగన్నాథ ఆలయ రత్న భాండాగారం.. లోపల ఏముందో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు అనంతరం మధ్యాహ్నం 1.28 గంటలకు రహస్య గదిని తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీ సభ్యులు ఈరోజు మధ్యాహ్నం జగన్నాథుని ఆలయంలోకి ప్రవేశించి ఖజానాను తెరిచారు. వీరిలో ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి బిస్వనాథ్ రాత్, శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (SJTA) చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధి, ASI సూపరింటెండెంట్ డీబీ గడ్నాయక్, పలువురు ప్రతినిధులు ఉన్నారు. వీరితో పాటు.. ఆలయానికి చెందిన నలుగురు సేవకులు (పట్జోషి మహాపాత్ర, భండార్ మెకప్, చదౌకరన్ మరియు ద్యులికరన్)లోపలికి చేరుకున్నారు. ఈసారి రత్న భాండాగారంలోని చెక్క పెట్టెల్లో భద్రపర్చిన ఆభరణాల లెక్కింపు ప్రక్రియనంతా డిజిటలైజ్ చేయనున్నారు. నిధిని మరో చోటకు తరలించేందుకు కొత్తగా ఆరు భారీ చెక్క పెట్టెలను ఏర్పాటు చేశారు.

Vivek Ramaswamy: “ట్రంప్‌ని దేవుడే రక్షించాడు”..భారతీయ అమెరికన్ వ్యాఖ్యలు..

ఈరోజు ఉదయం రత్న భాండాగారం తెరవనున్న నేపథ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శతాబ్దాలుగా భక్తులు, పూర్వపు రాజులు విరాళంగా ఇచ్చిన విలువైన ఆభరణాలు రత్న భండార్‌లో ఉన్నాయి. పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా.. 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఇక ఆ రత్న భాండాగారం.. లోపల విషసర్పాలు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. స్నేక్‌ హెల్ప్‌లైన్‌ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లను కూడా అందులోకి పంపించినట్లు తెలుస్తోంది.

Somasila Project: సోమశిల జలాశయాన్ని పరిశీలించిన మంత్రులు

రత్న భండార్‌లో ఉన్న విలువైన వస్తువులకు సంబంధించిన డిజిటల్ కేటలాగ్‌ను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో వాటి బరువు, కూర్పుకు సంబంధించిన సమాచారం ఉంటుంది. కాగా.. ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది? అనేది అధికారులు చెప్పలేకపోతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • jagannath temple
  • Odisha
  • open
  • ratna-bhandagaram

తాజావార్తలు

  • IPL 2026 Today: నేడు డబుల్ ధమాకా.! ఢిల్లీతో ముంబై ఢీ.. రాజస్థాన్‌తో గుజరాత్ పోరు!

  • Mahela Jayawardene: 2020 నుంచి ముంబైకి ఒక్క కప్పు కూడా ఎందుకు రాలేదు? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోచ్!

  • US-Iran War: ‘‘మనం యుద్ధంలో ఉన్నాం’’.. పైలట్‌ గల్లంతుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • Father Fights Crocodile: కన్నప్రేమ ముందు ఓడిన మృత్యువు.. కుమారుడి కోసం మొసలితో పోరాడిన తండ్రి!

  • Kamal Haasan: ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు చేదు అనుభవం

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions