దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు అనంతరం మధ్యాహ్నం 1.28 గంటలకు రహస్య గదిని తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీ సభ్యులు ఈరోజు మధ్యాహ్నం జగన్నాథుని ఆలయంలోకి ప్రవేశించి ఖజానాను తెరిచారు. వీరిలో ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి బిస్వనాథ్ రాత్, శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (SJTA) చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధి, ASI సూపరింటెండెంట్ డీబీ గడ్నాయక్, పలువురు ప్రతినిధులు ఉన్నారు. వీరితో పాటు.. ఆలయానికి చెందిన నలుగురు సేవకులు (పట్జోషి మహాపాత్ర, భండార్ మెకప్, చదౌకరన్ మరియు ద్యులికరన్)లోపలికి చేరుకున్నారు. ఈసారి రత్న భాండాగారంలోని చెక్క పెట్టెల్లో భద్రపర్చిన ఆభరణాల లెక్కింపు ప్రక్రియనంతా డిజిటలైజ్ చేయనున్నారు. నిధిని మరో చోటకు తరలించేందుకు కొత్తగా ఆరు భారీ చెక్క పెట్టెలను ఏర్పాటు చేశారు.
Vivek Ramaswamy: “ట్రంప్‌ని దేవుడే రక్షించాడు”..భారతీయ అమెరికన్ వ్యాఖ్యలు..
ఈరోజు ఉదయం రత్న భాండాగారం తెరవనున్న నేపథ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శతాబ్దాలుగా భక్తులు, పూర్వపు రాజులు విరాళంగా ఇచ్చిన విలువైన ఆభరణాలు రత్న భండార్‌లో ఉన్నాయి. పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా.. 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఇక ఆ రత్న భాండాగారం.. లోపల విషసర్పాలు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. స్నేక్ హెల్ప్‌లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లను కూడా అందులోకి పంపించినట్లు తెలుస్తోంది.
Somasila Project: సోమశిల జలాశయాన్ని పరిశీలించిన మంత్రులు
రత్న భండార్‌లో ఉన్న విలువైన వస్తువులకు సంబంధించిన డిజిటల్ కేటలాగ్‌ను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో వాటి బరువు, కూర్పుకు సంబంధించిన సమాచారం ఉంటుంది. కాగా.. ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది? అనేది అధికారులు చెప్పలేకపోతున్నారు.