Puri Jagannadh: ‘స్లమ్ డాగ్’ రిలీజ్‌కు ముందే.. పూరీ నెక్స్ట్ మూవీ ఫిక్స్!

Pori Jaganadha Directer

Pori Jaganadha Directer

పూరీ జగన్నాథ్ సినిమా అంటే హీరోల ఆటిట్యూడ్ పీక్స్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఆయన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో తెరకెక్కించిన “స్లమ్ డాగ్” సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లేదా సాంగ్ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.అయితే, ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే పూరీ తన తదుపరి ప్రాజెక్ట్‌ను సైలెంట్‌గా లాక్ చేసేశారని సమాచారం.

Also Read: Dhurandhar : ధురంధర్ సెట్స్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన అర్జున్ రాంపాల్..!

పూరీ తన తర్వాతి సినిమాను టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ మాస్ హీరోతో ప్లాన్ చేస్తున్నారట. పూరీ మార్క్ డైలాగులు, ఆ హీరో మాస్ ఇమేజ్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఇండస్ట్రీ టాక్. మరి ఇంతకి ఆ హీరో ఎవరు.. అనేది మేకర్స్ సస్పెన్స్‌లో ఉంచారు. కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. గతంలో పూరీతో పనిచేసిన ఒక స్టార్ హీరో లేదా ఒక క్రేజీ యంగ్ మాస్ హీరోతో ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. చూస్తుంటే ఈసారి పూరీ బాక్సాఫీస్ దగ్గర గట్టి వేటకే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మరి ఆ మాస్ హీరో ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!