NTV Telugu Site icon

Double Ismart Twitter Review: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ట్విటర్ రివ్యూ.. పూరి ఈజ్ బ్యాక్!

Double Ismart Twitter Review

Double Ismart Twitter Review

Ram Pothineni’s Double Ismart Movie Twitter Review: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. గతంలో పూరి-రామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కావ్య థాపర్‌ కథానాయిక కాగా.. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ ప్రతినాయకుడిగా నటించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ డబుల్‌ ఇస్మార్ట్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Also Read: Thangalaan Twitter Review: తంగలాన్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

ఇప్పటికే ఓవర్‌సీస్‌తో పాటు ఇండియాలోనూ పలు చోట్ల డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రం ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన నెటిజన్స్‌ తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమాకు మంచి టాక్ వస్తోంది. ‘మాస్ రాంపేజ్, రామ్‌ ఎనర్జి వేరే లెవల్. పూరి సర్ కమ్ బ్యాక్ మూవీ. మాస్ డైలాగ్స్, సూపర్ సాంగ్స్. 3.5 రేటింగ్’ అని ఓ నెటిజెన్ ట్వీట్ చేశాడు. ‘ఫస్ట్ హాఫ్‌, సెకండాఫ్ ఎక్సలెంట్‌’ అని మరోకరు ట్వీట్ చేశారు. ‘సినిమా అద్భుతం’, ‘పూరి ఈజ్ బ్యాక్’, ‘రామ్ మాస్‌ యాక్షన్‌ అదిరిపోయింది’, ‘బ్లాక్‌బస్టర్ హిట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments