NTV Telugu Site icon

Pure EV Ecodryft 350: స్ప్లెండర్‌కు పోటీగా కొత్త ఈవీ బైక్.. ధర ఎంతంటే?

Ev Bikes

Ev Bikes

ఇండియాలో ఈవీ బైకులకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది..ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న వాహన కాలుష్యం నుంచి రక్షణ కోసం ఈవీ వాహనాలపై సబ్సిడీలను ఇస్తూ వాటి కొనుగోలును ప్రోత్సహిస్తున్నారు. ఇక ప్రముఖ కంపెనీలు సైతం ఈవీ బైకులను సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి తీసుకొని వస్తున్నారు.. కార్లతో పోల్చుకుంటే స్కూటర్లు, బైక్‌ల్లో ఈవీ వెర్షన్లు బాగా క్లిక్‌ అయ్యాయి. భారతదేశం బైక్‌ మార్కెట్‌లో మధ్యతరగతి ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంది హీరో స్ప్లెండర్‌ బైక్‌. అయితే ఇప్పుడు హీరో స్ప్లెండర్‌కు గట్టి పోటీనిస్తూ ఇంచుమించు అదే డిజైన్‌తో సరికొత్త లుక్ తో ఈవీను లాంచ్‌ చేశారు. ప్రముఖ ఈవీ వాహన తయారీదారు ప్యూర్‌ ఈవీ ఎకో డ్రైఫ్ట్‌ 350 బైక్‌ను మార్కెట్ లోకి వదిలింది..

ఈ బైక్‌ ధర సుమారు రూ.1.30 లక్షలుగా ఉంటుంది. ఈ బైక్‌ ముఖ్యంగా 110 సీసీ పెట్రోల్‌ బైక్స్‌కు గట్టి పోటీనిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బైక్‌ను ఓ సారి చార్జ్‌ చేస్తే  171 కిలో మీటర్ల మైలేజ్‌ ఇవ్వనుంది.. ఇకపోతే ఏడువేల ఆదాయాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.. అంతేకాదు 3.5 కేడబ్ల్యూహెచ్‌ లిథియం ఐయాన్‌ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ బైక్‌ ఆరు ఎంసీయూలతో 3 కేడబ్ల్యూతో ఎలక్ట్రిక్‌ మోటర్‌కు శక్తినిస్తుంది. ఈ బైక్‌ 40 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌తో గంటకు 75 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది.ఇందులో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి..

ఈ కొత్త బైక్ కోస్టింగ్‌ రీజెన్‌, హిల్‌ స్టార్‌ అసిస్ట్‌ టు డౌన్‌-హిల్‌ అసిస్ట్‌, పార్కింగ్‌ అసిస్ట్‌ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది. ఈ బైక్‌లో స్మార్ట్‌ ఏఐ, స్టేట్‌ ఆఫ్‌ చార్జ్‌, స్టేట్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రకారం బ్యాటరీ సుధీర్ఘ జీవితాన్ని నిర్ధారిస్తుంది. ఈ ప్యూర్‌ ఈవీ బైక్‌ ఎంట్రీ బైక్లు అయిన హీరో స్ప్లెండర్‌, హోండా షైన్‌, బజాజ్‌ ప్లాటినా వంటి బైక్స్‌ వాటికి మార్కెట్ లో పోటీని ఇస్తుంది.. ఈ కంపెనీ కస్టమర్లకు కూడా సులువుగా కొనుగోలు చేసే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది.. ఈఎంఐ అప్షన్స్ ను కూడా అందిస్తుంది.. ఇంకా ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేసుకోండి..