NTV Telugu Site icon

Purandeswari: రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుంది..

Purandewshwari

Purandewshwari

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్రా అనే పథకం కాదు వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంతో ఆడుకుంటుంది.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి అన్యాయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైలుకు పంపించే పరిస్థితి ఉంది అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఘోరాతి ఘోరమైన నియంతృత్వ పాలన సాగుతుంది.. మాటతప్పం మడమ తిప్పం అనే ప్రభుత్వం నాలుక మడత పెడుతున్నారు అంటూ పురంధేశ్వరి విమర్శించారు.

Read Also: Rajnath Singh: టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవ్వాలి.. క్యాడెట్లకు రాజ్ నాథ్ సింగ్ శుభాకాంక్షలు

ప్రాంతాలు కులాల మధ్య విభేదాలు సృష్టించే ఇటువంటి ప్రభుత్వం మనకు కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి అని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో లబ్ధిదారుల వేదన దారుణంగా ఉంది కనీస వసతులు కల్పించడంలో గాని మంచినీరు పారిశుధ్యం పరిరక్షణ గాని లేకుండా ఉంది.. టిడ్కో లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు తాకట్టు పెట్టడం ద్వారా 4:30 లక్షలు వడ్డీ భారం పడిందని గగ్గోలు పెడుతున్నారు అని ఆయన విమర్శలు గుప్పించారు. కోటిపల్లి- నర్సాపురం రైల్వే లైన్ పనులు 75 శాతం కేంద్ర ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వ వాటా 25 శాతం నిధులు విడుదల కాలేదు.. జిల్లాకు లక్షా ఐదు వేల ఇళ్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఎన్ని ఇళ్ళు నిర్మించారో లబ్ధిదారులకు అందించారు జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.. జగన్ ప్రభుత్వం రూ . 170 కోట్లకు తాకట్టు పెట్టారు. పేదలకు నోటీసులు ఇవ్వడం దారుణం.. ఇటీవల తుఫాన్ ప్రభావంతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.