Site icon NTV Telugu

Purandeswari: రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు విలయ తాండవం చేస్తుంది..

Purandeshwari

Purandeshwari

అనకాపల్లి జిల్లా సంస్థాగత సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరికి చెరుకుతో రైతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 400 మండలాలకు పైగా కరువు విలయ తాండవం చేస్తుంటే.. కేవలం100 మండలాలు మాత్రమే కరువు ఉందని చెప్పడం మోసపూరితం అన్నారు. కరువు మీద వాతావరణ శాఖ హెచ్చరించినా.. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం రైతాంగం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కున్న అగౌరవ భావం, చిన్నచూపు కాదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినా అభివృద్ధి నిరోధకులుగా మారారు.. అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ విధ్వంసకర, విద్వేష పూరిత పాలన చేస్తోంది అని పురంధేశ్వరి మండిపడింది.

Read Also: Karachi Fire Accident: షాపింగ్ మాల్‌లో అగ్ని ప్ర‌మాదం.. 11 మంది మృతి!

దేశాభివృద్ధికి బీజేపీ పెద్దపీట వేస్తోందన్న పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏపీకి సంపూర్ణమైన సహకారాన్ని మోడీ ప్రభుత్వం అందిస్తుంది.. ఏపీ అగ్రగామిగా ఉండేందుకు అన్ని రకాల సాయం కేంద్ర సర్కార్ అందిస్తుంది.. రాష్ట్రంలో అభివృద్ధి కేంద్రం నిధులతోనే జరుగుతోందని ఆమె వెల్లడించారు. జగన్‌ ప్రభుత్వం మాత్రం ప్రజా ధనాన్ని దండుకునే ఆలోచన చేస్తోందని విమర్శలు చేశారు. రోడ్లు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులను కేటాయిస్తుంటే.. గుంతల రోడ్లలో ప్రమాదాలు జరిగి ప్రజలు మరణిస్తురు.. కానీ, జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది.

Exit mobile version