Site icon NTV Telugu

Punjab: ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్య..

Rss

Rss

Punjab: పంజాబ్‌లో ఒక పెద్ద సంఘటన జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్తను కాల్చి చంపారు. ఇంటికి వెళ్తుండగా RSS కార్యకర్తపై దాడి జరిగింది. మృతుడిని నవీన్ అరోరాగా గుర్తించారు. ఈ సంచలనాత్మక సంఘటన తర్వాత.. ప్రభుత్వం చురుగ్గా స్పందించింది. నిందితులను పట్టుకోవడానికి పంజాబ్ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు.

READ MORE: Major Accident: కీసర టోల్ గేట్ వద్ద దాసరి ట్రావెల్స్ బస్సులో మంటలు..

పంజాబ్‌ ఫిరోజ్‌పూర్‌లోని బుధ్వారా వాలా పరిసరాల సమీపంలో నవీన్ అరోరా (40) ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరు నిందితులు అతడిని కాల్పి చంపారు. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఫిరోజ్‌పూర్ ఎస్‌ఎస్‌పి భూపిందర్ సింగ్, ఎమ్మెల్యే రణ్‌బీర్ సింగ్ భుల్లార్ సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆధారాలు సేకరించేందుకు ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. నవీన్ అరోరా తాత దివంగత దీనానాథ్ ఫిరోజ్‌పూర్ నగరంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌గా పనిచేశారు. నవీన్ తండ్రి సైతం ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం కలిగి ఉన్నారు. ప్రస్తుతం నవీన్ సైతం ఆర్ఎస్ఎస్‌లో కీలక బాధ్యతలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మృతుడు నవీన్ తండ్రి బల్దేవ్ మాట్లాడుతూ.. “నవీన్ దుకాణం నుంచి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని దుండగులు దాడి చేసి కాల్చి చంపారు. నవీన్ అక్కడికక్కడే మరణించారు. నవీన్‌కు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.” అని పేర్కొన్నారు.

READ MORE: Deepika-Prabhas : ప్రభాస్ తో మూవీ అయితే 8 గంటలు.. SRK దగ్గర మాత్రం ఎన్ని గంటలైనా ఓకేనా?

Exit mobile version