Police Taking Off Clothes: పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని డీసీ కాంప్లెక్స్ వెలుపల విధులు నిర్వహిస్తుండగా, మద్యం మత్తులో అభ్యంతరకర చర్యలకు పాల్పడినందుకు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎఎస్‌ఐ)ని సస్పెండ్ చేశారు. ఆరోపణల ప్రకారం.. ఏఎస్సై సురీందర్ సింగ్ మద్యం మత్తులో తన బట్టలు విప్పి తన ప్రైవేట్ భాగాలను బహిర్గతం చేశాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన ఉన్నతాధికారులు అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు.
Nephew Kills Uncle: ఆవు విషయంలో వివాదం.. మామను కొట్టి చంపిన మేనల్లుడు
నిందితుడైన అధికారిని సస్పెండ్ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కమల్‌జిత్ సింగ్ ఔలాఖ్ వెల్లడించారు. ఏఎస్‌ఐ సురీందర్ సింగ్ డీసీ కాంప్లెక్స్ బయట విధులు నిర్వర్తిస్తున్నారని, మద్యం మత్తులో డ్యూటీ చేస్తున్నట్టు కొందరు జర్నలిస్టులు షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారిందని, అతనిపై సస్పెన్షన్‌కు నివేదిక పంపామని, అతనిపై విచారణ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.
