NTV Telugu Site icon

Lottery: రాత్రికి రాత్రే ‘కోటీశ్వరుడు’.. 88 ఏళ్ల వృద్ధుడికి రూ.5కోట్ల జాక్‌పాట్‌

Lottery

Lottery

Lottery: పంజాబ్‌లోని డేరా బస్సీలో 88 ఏళ్ల వృద్ధుడు రూ. 5 కోట్ల లాటరీని గెలుచుకున్న తర్వాత రాత్రికి రాత్రే ‘కోటీశ్వరుడు’ అయ్యాడు. డేరా బస్సీలోని త్రివేది క్యాంప్‌లో నివసించే మహంత్ ద్వారకా దాస్ లోహ్రీ మకర్ సక్రాంతి బంపర్ లాటరీని గెలుచుకున్నాడు. ఇది అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. అతనిని అభినందించడానికి, పూలమాలలు వేయడానికి ప్రజలు అతని ఇంటికి రావడంతో ఆ ప్రాంతంలో వేడుకలు జరిగాయి.

ద్వారకా దాస్ తన కుటుంబం వద్దని వారించినా తరచుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేసేవాడు. లాటరీ తగిలిన తర్వాత అందులో సగం డబ్బును డేరా బస్సీ గ్రామానికి పంచి.. మిగతా డబ్బును తన కొడుకులిద్దరికీ సమానంగా పంచుతానని చెప్పాడు. తాను సంతోషంగా ఉన్నానని.. గత 35-40 సంవత్సరాలుగా లాటరీలు కొంటున్నానని వెల్లడించారు. ప్రస్తుతం అతని కుమారుడు నరేందర్ కుమార్ కార్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జిరాక్‌పూర్‌లో లాటరీ వ్యాపారం చేస్తూ, ఆ టిక్కెట్టును కుటుంబానికి విక్రయించిన లోకేష్.. పన్నులు మినహాయించిన తర్వాత ద్వారకా దాస్‌కు సుమారు రూ. 3.5 కోట్లు వస్తాయని పేర్కొన్నాడు.

Customer Data: 37 మిలియన్ల టీ-మొబైల్ వినియోగదారుల కస్టమర్ డేటా హ్యాక్

“పంజాబ్ స్టేట్ లోహ్రీ మకర సంక్రాంతి బంపర్ లాటరీ 2023 ఫలితాలు జనవరి 16న ప్రకటించబడ్డాయి. అతను (ద్వారకా దాస్) రూ. 5 కోట్ల మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. నిర్దేశించిన విధానాన్ని పూర్తి చేసిన తర్వాత, 30% పన్ను మినహాయించిన తర్వాత మొత్తం అతనికి ఇవ్వబడుతుంది.” అని అసిస్టెంట్ లాటరీ డైరెక్టర్ కరమ్ సింగ్ తెలిపారు.

Anurag Kashyap : పరిస్థితులు ఇప్పటికే చేయి దాటిపోయాయి.. మోడీ అప్పుడే చెబితే బాగుండు

డిసెంబర్‌లో, ఎమిరేట్స్ డ్రాలో భారతదేశానికి చెందిన దుబాయ్‌కు చెందిన డ్రైవర్ అజయ్ ఒగులా 15 మిలియన్ దిర్హామ్ (రూ. 33 కోట్లు) విలువైన బహుమతిని గెలుచుకున్నాడు. లాటరీ బహుమతిని గెలుచుకున్న తర్వాత తాను జాక్‌పాట్ కొట్టినట్లు ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అజయ్ ఒగులా అన్నాడు. దక్షిణ భారతదేశంలోని ఒక గ్రామానికి చెందిన అజయ్ ఒగులా నాలుగేళ్ల క్రితం యూఏఈకి వచ్చారు. ప్రస్తుతం ఆభరణాల సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్న అతను ప్రతి నెలా 3,200 దీనార్లు సంపాదిస్తున్నాడని ఖలీజ్ టైమ్స్ నివేదించింది