Site icon NTV Telugu

Man Kills Neighbours: పిల్లలను కనవా.. అని అడిగినందుకు సుత్తితో కొట్టి ముగ్గురిని చంపేశాడు..

Crime News

Crime News

Man Kills Neighbours: పిల్లలను కనవా.. అని పదే పదే ఓ కుటుంబం ఓ వ్యక్తిని ప్రశ్నించింది. దీంతో విసుగుచెందిన ఓ వ్యక్తి ఆ కుటుంబంలోని ముగ్గురిని సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లోని లూథియానాలోని సేలం తబ్రీ ప్రాంతంలో జరిగింది. 46 ఏళ్ల నిందితుడిని ఆ కుటుంబంలోని వ్యక్తులు బిడ్డను కనాలని వేధించడంతో ముగ్గురిని సుత్తితో కొట్టి చంపినందుకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడు రాబిన్‌ అలియాస్ మున్నా బాధిత కుటుంబానికి పొరుగున నివసిస్తున్నాడు. ఈ సంఘటన గురువారం జరిగిందని లూథియానా పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: Vande Bharat Express: త్రివర్ణ పతాకం స్ఫూర్తితో వందేభారత్ కొత్త లుక్.. రైలులో చేసిన అప్‌గ్రేడ్‌లు ఇవే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రాబిన్ అలియాస్ మున్నా అనే ఓ వ్యక్తి పక్కింట్లో సురీందర్ కౌర్ (70), ఆమె భర్త చమన్ లాల్ (75), ఆమె అత్త (సుమారు 90 ఏళ్లు) ఉంటున్నారు. మున్నాకు పెళ్లై కొన్నేళ్లు అవుతున్నా సంతానం కలగలేదు. దీంతో పక్కింట్లో ఉంటున్న సురీందర్ కౌర్, ఆమె భర్త చమన్ లాల్ మున్నాను పిల్లలు కనాలని అడిగేవారని చెప్పారు. అయితే గురువారం కూడా ఇలా ఒకరి తర్వాత వాళ్లు అతడిని సంతానం విషయమై మాట్లాడారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన మున్నా సుత్తితో ఆ ముగ్గురి తలపై కొట్టాడు. దీంతో వాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని కమిషనర్ మన్ దీప్ సింగ్ సిద్ధూ తెలిపారు. తన తర్వాత భార్యను చూసుకునే వారు ఎవరూ లేరని, తన భార్యను కూడా అరెస్ట్ చేయాలని వేడుకున్నాడు. మున్నా నేరం చేసినట్లు అంగీకరించినట్లు సీపీ తెలిపారు.

Also Read: Farming: గోమూత్రంతో పంటల సాగు.. పెరిగిన దిగుబడి..!

నేరాన్ని యాక్సిడెంట్‌గా చూపించడానికి, మున్నా వంట గ్యాస్ సిలిండర్ వాల్వ్‌ని తెరిచి, అగరబత్తిని వెలిగించాడు, తద్వారా గదిలో మంటలు వ్యాపించాయి. అన్ని ఆధారాలు ధ్వంసమయ్యాయి. మున్నా నుంచి బాధితుల్లో ఒకరికి చెందిన కెమెరా, మొబైల్ ఫోన్ ఉన్న బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యూవీ లైట్ కింద ఉన్న సుత్తిపై రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

శుక్రవారం ఉదయం బాధితుల ఇంటికి తాళం వేసి ఉండడంతో పాల వ్యాపారి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించగా ఎవరూ స్పందించకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని వారు తెలిపారు. గురువారం కూడా ఎవరూ ఇంటి తలుపులు తెరవలేదని పాల వ్యాపారి పోలీసులకు తెలిపాడు. ఇరుగుపొరుగు వారు ముందు గోడ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులు ముగ్గురు చనిపోయారని పోలీసులు తెలిపారు. కౌర్, లాల్‌ల నలుగురు కుమారులు విదేశాల్లో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Exit mobile version