ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ 16లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
Also Read : Pawan Kalyan: కేరళ బోటు ప్రమాదం విచారకరం.
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక తొలి ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(47 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 57 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించగా జితేశ్ శర్మ(18 బంతుల్లో 2 సిక్సర్లతో 21 పరుగులు) పర్వాలేదనిపించాడు. భానుకా రాజపక్స(0), లివింగ్ స్టోన్(15), సామ్ కర్రన్(4)లు విఫలం కాగా. ఆఖర్లో షారుక్ ఖాన్(8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 21 పరుగులతో నాటౌట్), హర్‌ప్రీత్ బ్రార్( 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 17 పరుగులతో నాటౌట్) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు, హర్షిత్ రాణా రెండు వికెట్లు తీయగా సుయాష్ శర్మ, నితీశ్ రాణా తల ఒక్కొ వికెట్ తీసుకున్నారు.
Also Read : IPL 2023 : 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్ ఎంతంటే..?
పంజాబ్ కింగ్స్ జట్టు వరుస బ్రేక్ లలో వికెట్లు కోల్పోవడంతో కొద్దీగా ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేసింది. దీంతో వెంటవెంటనే కీలకమైన వికెట్లు తీస్తు కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ వేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి.. కేకేఆర్ కు 180 పరుగుల టార్గెట్ ను ఇచ్చారు.