Punjab King-IPL: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. మొదటి జట్టుగా..!
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
- అత్యల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసిన జట్టుగా పంజాబ్
- రెండు రికార్డులను కోల్‌కతాపైనే నెలకొల్పడం విశేషం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్లో అత్యల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసిన జట్టుగా పంజాబ్ రికార్డుల్లోకెక్కింది. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులను కాపాడుకుని.. 16 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పంజాబ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. మరోవైపు అత్యధిక స్కోర్ (262)ను ఛేదించిన టీమ్‌గా ఇప్పటికే పంజాబ్ రికార్డ్ సాధించింది. ఈ రెండు రికార్డులను కోల్‌కతాపైనే నెలకొల్పడం ఇక్కడ విశేషం.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (30; 15 బంతుల్లో 2×4, 3×6) టాప్ స్కోరర్. కేకేఆర్ బౌలర్లు హర్షిత్ రాణా (3/25), వరుణ్ చక్రవర్తి (2/21), సునీల్ నరైన్ (2/14) రాణించారు. స్వల్ప ఛేదనలో కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. అంగ్క్రిష్ రఘువంశీ (37; 28 బంతుల్లో 5×4, 1×6) ఒక్కడే రాణించాడు. పంజాబ్ బౌలర్లు యుజ్వేంద్ర చహల్ (4/28) చెలరేగగా.. మార్కో జాన్సెన్ (3/17) చెలరేగాడు.
Also Read
కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత స్వల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డు సృష్టించింది. దాంతో 16 ఏళ్ల చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. 2009లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 116/9 స్కోర్‌ను కాపాడుకుంది. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (118), పంజాబ్ కింగ్స్ (119/8), సన్‌రైజర్స్ హైదరాబాద్ (119/8) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!