Punjab: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ చబ్బేవాల్ తక్షణమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అనంతరం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. పంజాబ్‌లో ఆప్ కుటుంబం బలపడిందని ఆ పార్టీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పేర్కొంది. హోషియార్‌పూర్ జిల్లాలోని చబ్బేవాల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్‌కుమార్ చబ్బే వాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా అనుకూల విధానాలకు ప్రభావితమై ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారని, ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ స్వాగతం తెలిపింది.
అంతకుముందు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఉద్దేశించి తన సంక్షిప్త రాజీనామా లేఖలో.. “తక్షణమే అమలులోకి వచ్చేలా నేను భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను” అని పేర్కొన్నారు. చబ్బేవాల్ తన రాజీనామాకు గల కారణాలను ప్రస్తావించలేదు. 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రాజ్‌కుమార్ చబ్బేవాల్ చబ్బేవాల్ నుంచి తిరిగి ఎన్నికయ్యారు.
Read Also: Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. పార్టీకి ఎంపీ అబ్దుల్ ఖలీక్ గుడ్‌బై
పంజాబ్‌లో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఏర్పడిన ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. పంజాబ్ నుండి లోక్‌సభ ఎన్నికలకు ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆప్ గురువారం ప్రకటించింది. పంజాబ్‌లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన మొదటి పార్టీగా ఆప్ అవతరించింది.పంజాబ్‌లో 13 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. నాలుగు స్థానాలు షెడ్యూల్డ్ కులాల (SC) అభ్యర్థులకు రిజర్వు చేయబడ్డాయి.
