ఈటీవీ ‘జబర్దస్త్’ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కమెడియన్ గా చేస్తున్నాడు.. ఆయన పంచులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఆయన రెండు కిడ్నీలు సరిగ్గా పనిచెయ్యలేదన్న సంగతి తెలుసు.. దీని కోసం ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి లేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు..
ఆ ఆపరేషన్ కు భారీగా ఖర్చు అవుతుందని అందులో పేర్కొన్నాడు.. ఎంత వీలైతే అంత త్వరగా అతడికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాలని వైద్యులు చెప్పారు. లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. కిడ్నీ ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చవుతుంది. చేతులెత్తి వేడుకుంటున్నా.. దయచేసి మీకు తోచినంత సాయం చేయండి అని నూకరాజు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేశాడు..
అదే విధంగా మరో నటుడు ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.. అన్నకు సీరియస్ గా ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి చాలా ఖర్చు అవుతుంది. మేం అంతా ట్రై చేస్తున్నాం. మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నానని ఇమ్మాన్యుయేల్ పోస్ట్ చేశారు.. ఆ పోస్టులో ప్రసాద్ భార్య సునీత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దాతల నుంచి సాయం కోరుతూ ఈ పోస్ట్ లో పేర్కొన్నాడు…ఈ పోస్ట్ ఇప్పుడు అందరి చేత కంటతడి పెట్టిస్తుంది..దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు అతను త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు..