Dr Gedela Srinubabu: అద్భుత అవకాశాల వేదిక అయిన విశాఖ నగరం 2030 నాటికి $100 బిలియన్ల ఆర్థికవృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని పల్సస్ సీఈవో డా.గేదెల శ్రీనుబాబు వివరించారు. విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని ఇంజినీరింగ్ , MBA విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు, వైజాగ్‌ను $100 బిలియన్ల ఆర్థిక నగరంగా తీర్చి దిద్దెందుకు ఉన్న అవకాశాలను, ప్రణాళికలను వివరించారు. నగర ఆర్థిక గమ్యాన్ని రూపొందించడంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని శ్రీనుబాబు పిలుపునిచ్చారు. తరగతి గదులలో, కలలు వెంచర్లుగా పరిణామం చెందుతాయి మరియు విజ్ఞానం ఆవిష్కరణకు దారితీస్తుంది. ఈనాటి ప్రపంచ ప్రఖ్యాత ఆవిష్కరణలన్ని ఒకప్పుడు తరగతి గది నుంచి వచ్చినవే అని చెప్తూ ఈ రోజుల్లో ఉన్న ఫేస్ బుక్ గూగుల్ మరియు పెద్ద పెద్ద ఇన్నోవేటివ్ సంస్థలు తరగతి గది నుంచి ఉద్భవించినవే అని చెప్పారు.
బ్లూ ప్రింట్ ఆవిష్కరణ
వైజాగ్‌లో $100 బిలియన్ల ఆర్థికశక్తిగా ఎదిగేందుకు అవసరమైన బ్లూప్రింట్‌ను గేదెల శ్రీనుబాబు ఆవిష్కరించారు. అవకాశాల ద్వారాలు తెరుచుకున్న విశాఖ ఒక అందమైన నగరం మాత్రమే కాదు, ఒక బలీయమైన ఆర్థిక శక్తి కేంద్రం అని వివరించారు. బలమైన ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సహకారం చాలా కీలకమని పేర్కొన్నారు. వైజాగ్ ఆర్థిక భవిష్యత్తుకు మూలాధారంగా విద్యార్థులు, విద్యాసంస్థలదే ప్రధానపాత్ర అని వివరించారు. చదివిన చదువు, చేయాల్సిన ఉద్యోగాలు-స్థాపించాల్సిన పరిశ్రమల మధ్య అంతరాలు తొలగించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అకాడమిక్ క్లాస్‌రూమ్‌ల నుండి బిజినెస్ బోర్డ్‌రూమ్‌ల వరకూ విద్యార్థులు ఎదగాలి
నేటి క్లాసురూముల్లో విద్యార్థులే రేపటి బోర్డు రూముల్లో సీఈవోలు, ఎండీలు, చైర్మన్లుగా ఎదగాలని శ్రీనుబాబు ఆకాంక్షించారు. వైజాగ్‌లోని భవిష్యత్తు పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేయడంలో తాము టీచర్ పాత్ర పోషించేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యం పెంపుదల, వ్యాపార అనుకూల వాతావరణం కల్పించడం అత్యవసరం అని తెలిపారు.
వైజాగ్ ఆర్థిక పునరుజ్జీవనానికి చోదకశక్తి యువత
విశాఖ వంద బిలియన్ల ఆర్థిక నగరంగా ఎదిగే అవకాశం దానిలో విద్యార్థులు యొక్క పాత్ర గురించి గేదెల శ్రీనుబాబు ప్రసంగించారు. విశాఖ నగరం యొక్క $100 బిలియన్ డెస్టినీని రూపొందించడానికి వైజాగ్ యువత స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని శ్రీనుబాబు పిలుపునిచ్చారు. వైజాగ్ ఎకానమీ 2030 నాటికి $100 బిలియన్లకు చేరుతుందని పల్సస్ CEO ఆశాభావం వ్యక్తం చేశారు. “భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, 2030 నాటికి, విశాఖ నగరం అపూర్వమైన $100 బిలియన్ల ఆర్థికశక్తిగా ఎదిగేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయన్నారు.