Site icon NTV Telugu

Ambati Rambabu: మా కార్యాలయానికే వచ్చి ‘కాల్చిపారేస్తా’ అంటారా..? డీఎస్పీ వ్యాఖ్యలపై అంబటి ఫైర్..!

Ambati

Ambati

Pulivendula: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీ ఎన్నికలు ముగిశాయి. క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇచ్చారు. భారీ భద్రత మధ్య బ్యాలెట్‌ బాక్స్‌లు కడపకు తరలించనున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాదన నేపథ్యంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పులివెందుల వైసీపీ కార్యాలయానికి వచ్చారు. అవినాష్‌ ను వైసీపీ కార్యాలయంలోనే పోలీసులు నిర్బంధించారు. ఆ నేపథ్యంలో ఓ డీఎస్పీ వైసీపీ కార్యకర్తలను “ఎక్కువ చేస్తే కాల్చిపారేస్తా.. నా కొడకా.. నువ్వు తాగి మాట్లాడుతుండొచ్చు.. కానీ యూనిఫాం ఉందిక్కడ.” అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మా కార్యాలయానికే వచ్చి పార్టీ కార్యకర్తలను ‘నా కొడకల్లారా…. కాల్చిపారేస్తాను’ అంటూ పులివెందుల్లో డీఎస్పీ హెచ్చరించారు. పోలీస్ ఉద్యోగం ఇచ్చింది ప్రజలను కాల్చిపారేయడానికేనా? అని ప్రశ్నించారు.

READ MORE: AP Govt: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు జారీ..

“చంద్రబాబు, డీఐజీ ప్రవీణ్ అండగా ఉన్నారన్న అహంకారమా? వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు వెళ్ళి, వారి కార్యాలయంలో ఒకవైపు ఎంపీ ఉండగానే, బయట ఉన్న కార్యకర్తలను కాల్చి పారేస్తాను అంటూ హెచ్చరించడం డీఎస్పీ అహంకారానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికే ఖాకీదుస్తులు వేసుకుంటున్నారా? దానికి బదులు పచ్చచొక్కాలు వేసుకుని తిరిగితే బాగుంటుంది. ఇటువంటి దుర్మార్గమైన విధానాలను ఎన్నికల్లో చూడలేదు. రెండు జెడ్పీటీసీల కోసం చంద్రబాబు ఇంత కక్కుర్తి పడాలా? వందేళ్ళ పాటు ప్రజాస్వామ్యాన్ని తీసుకువెళ్ళారు. చరిత్ర హీనుడుగా మిగిలిపోతున్నాడు. ఈ సంప్రదాయం చంద్రబాబు, ఆయన కుమారుడిని వెంటాడదా? ఈ పరిణామాలను చూస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తల గుండెలు మండిపోతున్నాయి.” అని అంబటి వ్యాఖ్యానించారు.

READ MORE: Corporate Bookings : సినిమాల్లో కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటి?

Exit mobile version