Site icon NTV Telugu

Pulasa Fish: యానాంలో చిక్కిన పులస.. వేలంలో తీవ్ర పోటీ, కేజీకి ఊహించని ధర!

Pulasa Fish

Pulasa Fish

‘పుస్తెలు అమ్మైనా సరే.. పులస తినాలి’ అనే నానుడి గోదావరి జిల్లాలో బాగా విపిస్తుంటుంది. ‘పులస’ చేప దొరకడం చాలా అరుదు కాబట్టే.. జీవితంలో ఒక్కసారైనా పులసను తినాలని భావిస్తుంటారు. నదీ ప్రవాహానికి అతి వేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. అంతేకాదు ఈ చేప ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. అందుకే వేలంలో ఎంత ధర పెట్టడానికైనా జనాలు వెనుకాడరు. ఇప్పటికే ఎన్నో పులస చేపలు రికార్డు ధరలో అమ్ముడుపోయాయి.

Also Read: Lords Test: జేమీ స్మిత్‌ సరికొత్త చరిత్ర.. టెస్టుల్లో తొలి బ్యాటర్‌గా..!

గోదావరి నదికి వరదలు వచ్చే సమయంలో పులస చేపల సీజన్ ఆరంభం అవుతుంది. ఈ ఏడాది కూడా గోదావరికి వరద నీటి తాకిడి పెరిగింది. దాంతో పులస చేపల సీజన్ మొదలైంది. ఎర్ర నీరు ఉదృతంగా రావడంతో పులసలు ఎదురీదుతూ వస్తున్నాయి. ఇప్పటికే గోదావరి తీరానికి సమీపంలో ఉండే యానాం ప్రాంతంలో తొలి పులస చేప చిక్కింది. మూడు రోజుల క్రితం యానాం ఫిష్ మార్కెట్‌లో పులస రూ.4000 ధర పలికింది. ఈరోజు మరో పులస చేప మత్స్యకారులకు దొరికింది. పులస ప్రియలు వేలంలో పోటీ పడ్డారు. దాంతో కేజీ ధర రూ.15000 పలికింది. యానాంలో పులసల సందడి మొదలవడంతో మత్స్యకారుల పంట పండుతోంది.

Exit mobile version