NTV Telugu Site icon

Lottery Win: అదృష్టమంటే ఇతనిదే.. శబరిమల వెళ్లి రూ.20 కోట్ల జాక్‌పాట్ కొట్టేశాడు

Lottery

Lottery

చాలా మంది సరాదాగా జీవితలో ఏదైనా లాటరీ తగిలితే తప్ప బాగుపడం అంటుంటారు. అయినా మనకు అలాంటి అదృష్టం లేదులే అంటూ బాధపడిన సందర్భాలు ఉండుంటాయి. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు అప్పుడప్పుడు ఇలా నిట్టూర్పులు విడవడం సహజమే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

పుదుచ్చేరికి (Puducherry Man) చెందిన 33 ఏళ్ల ఓ బిజినెస్‌మేన్ శబరిమల యాత్రకు వెళ్లాడు. యాత్రలో భాగంగా ఆయన తిరువనంతపురంలో రూ.400లతో ఓ లాటరీ టికెట్‌ను (Lottery Win) కొనుగోలు చేశాడు. టికెట్ తీసుకుని ఇంటికి వచ్చేశాడు. కానీ అదృష్టం మాత్రం ఆయన ఇంటి తలుపు తట్టింది. ఒకేసారి ఏకంగా రూ.20 కోట్ల (Rs 20 crore) విలువైన బహుమతిని గెలుచుకున్నాడు. కేరళలోని రెండోవ అతిపెద్ద లాటరీ ఫ్రైజ్ (Lottery Prize) ఇదే కావడం విశేషం. దాదాపు రూ.400లతో 45 లక్షల మంది లాటరీ టికెట్లు కొంటే అందులో పుదుచ్చేరి వ్యాపారి లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. xc 224091 నెంబర్ గల లాటరీ టికెట్ రూ.20 కోట్ల బహుమతిని గెలుచుకుందని తెలియజేయగానే అతడు ఎగిరి గంతులేశాడు. ట్యాక్స్‌లు అన్ని పోగా రూ.12 కోట్లు అతని అకౌంట్లలో పడనున్నాయి.

ఆధారాలతో కూడిన అన్ని పత్రాలను, లాటరీ టికెట్‌ను తీసుకుని బిజినెస్‌మేన్ కేరళకు (Kerala) వెళ్లాడు. అతని వివరాలను యాజమాన్యం బయటకు తెలియపరచలేదు. బిజినెస్‌మేన్ కూడా తన చిరునామా, పేరు మీడియాకు తెలియపర్చవద్దని యాజమాన్యాన్ని వేడుకున్నాడు. దీంతో అతని వివరాలను గోప్యంగా ఉంచారు. ఏదేమైతే ఒకేసారి రూ.20 కోట్ల జాక్‌పాట్ కొట్టేశాడు.

ఇది కూడా చదవండి:Uttar Pradesh: పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుందని.. ప్రియురాలి గొంతు నులిమి చంపిన వ్యక్తి..