NTV Telugu Site icon

Public Examination Bill: పేపర్‌ లీకుల నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర..

Murmu

Murmu

జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ పోటీ పరీక్షలలో పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఫిబ్రవరి 5వ తేదీన ఇందుకు సంబంధించిన ‘పబ్లిక్‌ పరీక్షల అక్రమ మార్గాల నిరోధక బిల్లు-2024’ పేరుతో బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టగా.. ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదం తెలిపాయి. నిన్న ( మంగళవారం ) రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాగా.. దీంతో ఆ బిల్లుకు ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.

Read Also: Farmer Benefit Schemes : రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇవే

ఇక, ప్రభుత్వ ప్రవేశ పరీక్షలన్నింటిలో అక్రమాలను అరికట్టడం, అవకతవకలపై దర్యాప్తు చేయడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత తీసుకువచ్చే ఉద్దేశంతో బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపగా.. అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా కేంద్ర సర్కార్ నిర్ణయించిన తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా పేపర్‌ లీకేజీకి పాల్పడినా, మాల్‌ ప్రాక్టీస్‌ చేసినా, నకిలీ వెబ్‌సైట్లు ఓపెన్ చేసిన గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు కోటి రూపాయల వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంటుంది.

Read Also: Shiva Balakrishna: శివబాలకృష్ణ బీనామీల కేసు.. నేడు ఏసీబీ కార్యాలయంలో విచారణ

యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌, ఎన్‌డీఏ తదితర పోటీ పరీక్షలతో పాటు నీట్‌, జేఈఈ, సీయూఈటీ లాంటి ఎంట్రన్స్‌ టెస్టులకు సైతం చట్టం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, గత కొన్నేళ్లుగా ప్రశ్నాపత్రాల లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థులు, అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. చర్యలు తీసుకోకపోతే లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకున్నట్లేనన్నారు.

Read Also: MP Adala Prabhakar Reddy: నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ

అయితే, పేపర్ లీక్ కేసుల విచారణను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది. దర్యాప్తును ఏదైనా కేంద్ర ఏజెన్సీకి అప్పగించే అధికారం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కు ఉంటుంది. ఈ బిల్లులో పేపర్ లీకేజీతో ముడిపడిన 20 రకాల నేరాలు, అక్రమాలకు పాల్పడే వారికి విధించాల్సిన శిక్షల గురించి ఉన్నాయి. మాస్ కాపీయింగ్, జవాబు పత్రాలను తారుమారు, ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్, లాంటివి ఈ నేరాల జాబితాలో పొందుపర్చారు.