NTV Telugu Site icon

Pakistan Zindabad : పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు.. చితక్కొట్టిన జనం

Gadar

Gadar

Pakistan Zindabad : భారత్ లో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటే చుట్టూ ఉండేవారు ఊరుకుంటారా? అదీ కాకుండా థియేటర్ లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో బోర్డర్ లోని పరిస్థితులకు సంబంధించి ఎమోషనల్ గా సినిమా చూస్తున్నప్పుడు ఒక్కసారిగా దాయాది దేశానికి జిందాబాద్ కొడితే మన రక్తం మరిగిపోదు. కోపంతో అన్నవాళ్లను చితక్కొటేయం. సరిగా ఓ థియేటర్ లో కూడా అలానే జరిగింది. సినిమా చూస్తూ సడెన్ గా లేచి పాకిస్తాన్ జిందాబాద్ అన్న ఓ ఇద్దరికి దేహశుద్ది జరిగింది.

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన గదర్-2 సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 2011లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గదర్ కు ఈ చిత్రం సీక్వెల్. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమాను 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో బోర్డర్ లోని పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించారు.

Also Read: Viral Video: బైక్‌ ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్‌ పోలీసులు.. ప్రియురాలిని పడేసి పారిపోయిన యువకుడు
అయితే సినిమా చూస్తున్న సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు లేచి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అరిచారు. దాంతో అక్కడున్న వారికి మండి వారిని కుమ్మేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరిగ్గా ఈ ఘటన జరుగుతున్నప్పుడే సినిమాలో హీరో కూడా వార్నింగ్ ఇవ్వడం మనం చూడవచ్చు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు. వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Show comments