NTV Telugu Site icon

PSR Anjaneyulu: జడ్జి ముందు తన వాదనలు తానే వినిపించిన పీఎస్‌ఆర్‌!

Psr Anjaneyulu

Psr Anjaneyulu

ముంబై నటి జత్వానీ కాదంబరి కేసులో ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ ఛీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును బుధవారం ఉదయం జడ్జి ముందు సీఐడీ ప్రవేశపెట్టింది. రిమాండ్‌ కోసం వాదనలు జరిగ్గా.. జడ్జి ముందు పీఎస్‌ఆర్‌ తన వాదనలు తానే వినిపించుకున్నారు. జత్వాన్ని కేసులో ఏం జరిగిందన్న అంశాలను జడ్జికి పీఎస్ఆర్ వివరించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పాత్ర లేకపోయినా తన మీద కేసు పెట్టారని పీఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. మాజీ డీసీపీ విశాల్ గున్నిని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో అప్రూవర్‌గా మారి.. ఈ కేసులో తనకు సంబంధం లేని విషయాలను చెప్పించారని జడ్జ్ ముందు పీఎస్‌ఆర్‌ చెప్పారు. 164 స్టేట్మెంట్ ఇవ్వమని విశాల్ గున్నిని అడిగినా.. ఇవ్వడానికి ఆయన నిరాకరించారని చెప్పారు.

Also Read: Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్ర దాడిలో మరణించిన నెల్లూరు వాసి.. 42 బుల్లెట్లు!

ముంబై నటి జత్వానీ కాదంబరిని వేధించారంటూ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ అధికారులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ నగరం బేగంపేటలోని నివాసం నుంచి ఆయన్ని అదుపులోకి తీసుకుని.. విజయవాడకు తరలించారు. ఈరోజు ఉదయం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పీఎస్‌ఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను న్యాయస్థానానికి తరలించారు. జడ్జి ముందు పీఎస్‌ఆర్‌ తన వాదనలు తానే వినిపించుకున్నారు. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు రిమాండ్‌పై వాదనలు ముగిసాయి.