PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్‌లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSL: పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) చివరి దశకు చేరుకుంటోంది. నిన్న లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం వేదికగా జరిగిన ప్లేఆఫ్స్ పోరులో హైదరాబాద్ కింగ్స్‌మెన్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో కేవలం రెండు పరుగుల తేడాతో గెలిచిన హైదరాబాద్, సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను అందించింది.
చివరి ఆరు బంతుల్లో ఇస్లామాబాద్ యునైటెడ్ విజయానికి కేవలం ఆరు పరుగులు మాత్రమే కావాలి. క్రీజులో ఉన్న బ్యాటర్లను చూస్తే ఇస్లామాబాద్ విజయం ఖాయమని అందరూ భావించారు. అయితే, పాక్ స్టార్ పేసర్ నసీమ్ షా తమ్ముడైన హునైన్ షా అద్భుతం చేశాడు. అత్యంత ఒత్తిడిలోనూ ఏమాత్రం తడబడకుండా బౌలింగ్ చేసిన హునైన్, ఆ ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన ఫహీమ్ అష్రఫ్ వికెట్‌ను పడగొట్టాడు. తన అన్న నసీమ్ షాను గుర్తుకు తెచ్చేలా అతను వేసిన బంతులకు ఇస్లామాబాద్ బ్యాటర్ల దగ్గర సమాధానం లేకపోయింది. విజయం ఖరారు కావడంతో కింగ్స్‌మెన్ ఆటగాళ్లు మైదానంలోకి దూసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు.
Also Read
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ కేవలం 30 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, కుశాల్ పెరీరా 21 బంతుల్లో 37 పరుగులు చేసి అతడికి తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి నెలకొల్పిన సెంచరీ భాగస్వామ్యం జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించింది. ఇక లక్ష్య ఛేదనలో ఇస్లామాబాద్ యునైటెడ్ సైతం గట్టిగానే పోరాడింది. మార్క్ చాప్‌మన్ (43), హైదర్ అలీ (31) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగా, ఆఖర్లో ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ గ్రీన్ కేవలం 5 బంతుల్లోనే 19 పరుగులు చేసి మ్యాచ్‌ను ఇస్లామాబాద్ వైపు తిప్పాడు. గ్రీన్ మెరుపులతో విజయం అంచుల వరకు వచ్చిన యునైటెడ్‌ను హునైన్ షా తన బౌలింగ్‌తో అడ్డుకున్నాడు. ఈ విజయంతో ఫైనల్‌కు చేరిన హైదరాబాద్ కింగ్స్‌మెన్, ఆదివారం గడ్డాఫీ స్టేడియంలోనే జరిగే తుది పోరులో పెషావర్ జల్మీతో తలపడనుంది.
తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!